Mulugu Kiran Met with Mumbai Saraswathi Through and finally got married | Facebook weddings

Mulugu kiran mumbai saraswathi facebook wedding

Facebook Wedding, mulugu kiran mumbai saraswathi, facebook marriages, online marriage stories, love marriage, arrange marriages

Mulugu Kiran Mumbai Saraswathi Facebook Wedding : In 2013 Mulugu Kiran met with mumbai saraswathi through facebook. They share their personal feelings and their relation turns in love. Finally they convinced their parents and got married.

ఫేస్‘బుక్’ అయ్యారు.. పెళ్లిపీటలెక్కారు!

Posted: 05/07/2015 11:46 AM IST
Mulugu kiran mumbai saraswathi facebook wedding

ఇటీవలే కాలంలో ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా ఎన్నో ప్రేమజంటలు ఒక్కటవుతున్న విషయం తెలిసిందే! ముఖ్యంగా ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమం ద్వారా ఈ తరహా రిలేషన్ లు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ఇప్పటికే ఎన్నోజంటలు ఈ పేస్ బుక్ ద్వారా కలుసుకోగా.. తాజాగా మరోజంట ‘ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ‘ఫేస్ బుక్’లో కలిశాం’ అని డ్యూయెట్ పాడుకుంటోంది.

వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా ములుగు పట్టణానికి ములుగు పట్టణానికి చెందిన ఇనుముల రామస్వామి, సుగుణ దంపతుల కుమారుడు కిరణ్‌కు 2013లో ఫేస్‌బుక్ ద్వారా ముంబైకి చెందిన సరస్వతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వీరిద్దరి మరింత దగ్గరికి తీసుకొచ్చింది. ఒకర్నొకరి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అలా వీరి బంధం కాలక్రమంలో ప్రేమగా మారింది. తమ ఈ బంధాన్ని జీవితాంతం కొనసాగించాలని ఇద్దరూ భావించారు.

దీంతో వారు ఇరువురి పెద్దలను తమ ప్రేమ విషయం గురించి వివరించి, ఒప్పించారు. కుటుంబసభ్యుల అంగీకారం మేరకు ములుగులోని చర్చిలో కిరణ్, సరస్వతి బుధవారం పెళ్లి చేసుకున్నారు. వివాహ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వ్యవ స్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ సకినాల శోభన్ తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Facebook Wedding  mulugu kiran mumbai saraswathi  

Other Articles