Moga bus horror: Victim's father agrees to post-mortem

Punjab cm badals to meet moga victim s family

punjab cm Badals to meet Moga victim's family, Moga bus horror: Victim's father agrees to post-mortem, moga incident, girl's death, Punjab C M Parkash Singh Badal, punjab chief minister parkash singh badal, moga molestation incident, teenage girl, Parkash Singh Badal, Sukhbir Badal, Victim, Moga, Punjab

punjab chief minister parkash singh badal likely to meet teenage girls family who died in moga molestation incident

మోగా మృతురాలికి అంత్యక్రియలకు అంగీకరించిన తండ్రి

Posted: 05/03/2015 09:25 PM IST
Punjab cm badals to meet moga victim s family

కదులుతున్న బస్సులో లైంగిక వేధింపులకు పాల్పడి ఆపై తల్లీబిడ్డలను కిందకు తోసివేసిన దారుణ ఘటనపై పంజాబ్‌ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ ఎట్టకేలకు స్పందించారు. మోగా జిల్లా నాలుగు రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన సహించరానిదని, 16 ఏళ్ల బాలిక మరణం అత్యంత బాధాకరమన్నారు. మోగా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట బైఠాయించిన మృతురాలి కుటుంబాన్ని స్వంయంగా వెళ్లి కలుస్తానని చెప్పారు. అకాలీదళ్ మాజీ మంత్రి అజైబ్ సింగ్ మాతృమూర్తికి శ్రద్ధాంజలి ఘటించేందుకు ఆదివారం పటియాలాకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే తమ కుటుంబానికి చెందిన 'ఆర్బిట్ ఏవియేషన్' రవాణా సంస్థ అనుమతుల రద్దుపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.

మరోవైపు ఆసుపత్రివద్ద బైఠాయించిన మృతురాలి కుటుంబ సభ్యులకు మద్దతు తెలిపేందుకు వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభుత్వ వ్యతికేర నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నాలుగు రోజులుగా మోగా ఆసుపత్రి మార్చురీలోనే ఉన్న బాలిక మృతదేహానికి అంత్యక్రియలు జరిపేందుకు ఆమె తండ్రి అంగీకరించారని పోలీసులు ప్రకటించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు నష్టపరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పిస్తామని ప్రభుత్వం నుంచి హామీ రావడంతో మృతురాలి తండ్రి పోస్టుమార్టం చేయడానికి కూడా అంగీకరించారని పోలీసులు తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : moga incident  girl's death  Punjab C M Parkash Singh Badal  

Other Articles