Ex Delhi Police Chief Neeraj Kumar says media mis represented his comments

Dawood ibrahim spoke to me but never offered to surrender clarifies neeraj kumar

Dawood Ibrahim, surrender, CBI, Ex-Delhi Police chief Neeraj Kumar, Dawood Ibrahim, surrender, vijaya ramarao, CBI Ex-Chief, neeraj kumar chief publicity,

Ex Delhi Police Chief Neeraj Kumar says media mis represented his comments, he spoke to me but never offered to surrender clarifies Ex Delhi Police Chief

నాలుకు కరుచుకున్న నీరజ్ కుమార్.. మీడియా వక్రీకరించిందని వ్యాఖ్యలు

Posted: 05/03/2015 12:19 PM IST
Dawood ibrahim spoke to me but never offered to surrender clarifies neeraj kumar

మాఫియా డాన్,  భారత మోస్ట్ వాంటెడ్ జాబితాలో వున్న దావూద్ ఇబ్రహీం గురించి తాను చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపఢంతో ఢిల్లీ మాజీ పోలీస్ బాస్ నీరజ్ కుమార్ నాలుక కరుచుకున్నారు. తన వ్యాఖ్యలను మీడియాత వక్రీకరించిందని ఆయన చెప్పాల్సిందంతా చెప్పిన తరువాత.. నెపాన్ని మీడియాపైకి నెట్టారు. 1993 ముంబై బాంబు పేలుళ్ల అనంతరం లొంగిపోతానని దావూద్ తనతో సంప్రదింపులు జరిపారని, అయితే అప్పటి ప్రభుత్వం చివరి క్షణంలో ఆ ప్రయత్నాలను వమ్ము చేసిందని తాను చెప్పినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్, నాటి సీబీఐ డీఐజీగా ముంబై పేలుళ్ల కేసును దర్యాప్తు చేసిన నీరజ్‌కుమార్ ఖండించారు.

ముంబై పేలుళ్లకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దావూద్.. తనతో సంప్రదింపులు జరిపాడని, లొంగిపోవటానికి సంసిద్ధత తెలిపాడని, అయితే అప్పటి తన రాజకీయ బాసులు ఈ ప్రణాళికను చివరి క్షణంలో అడ్డుకున్నారని నీరజ్ తమకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై నీరజ్ స్పందిస్తూ.. తాను ఆ పత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని, సదరు విలేకరి తనకు బాగా తెలుసునని, ఆయనతో పిచ్చాపాటీగా మాట్లాడిన మాటలను వక్రీకరించారని.. అవి సరికాదని, దురదృష్టకరమైనవని నీరజ్ కుమార్ అన్నారు. అయితే.. తాను సీబీఐ డీఐజీగా ముంబై పేలుళ్ల కేసును దర్యాప్తు చేసినపుడు దావూద్ తనతో మాట్లాడాడని, అది పేలుళ్లలో తన పాత్ర లేదని చెప్పటం కోసమే మాట్లాడాడని తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dawood Ibrahim  surrender  CBI  Neeraj Kumar  

Other Articles