Ruling TMC leading in crucial West Bengal civic polls

Tmc emerges clear winner in bengal civic polls

All India Trinamool Congress, West Bengal, Left Front, Municipal Corporation, Counting, Municipal Corporation Election 2015, Mamata Banerjee, Bharatiya Janata Party, Indian National Congress, West Bengal Municipal elections result, West Bengal Municipal Elections Results 2015, Civic Polls Results 2015, West Bengal Municipal Elections Live Coverage, West Bengal Elections Results 2015, West Bengal Elections 2015, West Bengal Election Counting, KMC Election Counting Result 2015, West Bengal Election Live, West Bengal Civic Polls

West Bengal Chief Minister Mamata Banerjee-led Trinamool Congress is leading in 67 out of 91 civic bodies even as counting of votes in the recently-concluded West Bengal municipal corporation elections is underway on Tuesday.

సత్తా చాటిన దీదీ.. ‘పురపాలకాల’లో పైచేయి

Posted: 04/28/2015 04:13 PM IST
Tmc emerges clear winner in bengal civic polls

పశ్చిమ బెంగాల్  ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మరోమారు తన సత్తా చాటుకున్నారు. ఏడాది క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తన పట్ల ప్రజల్లో వున్న అభిమానం చెక్కు చెదరలేదని రుజువు చేసిన దీదీ.. ఏడాది అనంతరం తాజాగా జరిగిన పురపాలక సంఘాలలో కూడా తన సత్తాను చాటుకుంది. శారదా స్కాం సహా పలు కుంభకోణాలతో పార్టీ నేతలు జైలు పాలైనా.. మరికోందరు బీజేపి పార్ట వైపు ఆకర్షితులై.. ఫిరాయింపులకు పాల్పడినా.. అమె మోక్కవోని ధైర్యంతో ఎన్నికల కదనరంగంలోకి దూకారు. తన ప్రభుత్వ పాలనపై ప్రజలు మరోమారు అమోదాన్ని తెలుపుతూ.. మూడింట రెండెంతుల మెజారిటీని కట్టబెట్టారు.

తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా వున్న 91 పురపాలక సంఘాలలో 67 మున్సిపాలిటీలను తృణముల్ కైవసం చేసుకుంది. కోల్ కతా నగరపాలక సంస్థను టీఎంసీ చేజిక్కించుకుంది. కోల్ కతా 144 వార్డుల్లో 110 సీట్లకుపైగా టీఎంసీ గెలుచుకుంది. ఇక్కడ వామపక్ష పార్టీలు కేవలం 16 సీట్లను మాత్రమే గెలుచుకోగా, బీజేపి 9, కాంగ్రెస్ 7 సీట్లను మాత్రమే దక్కించుకోగలిగాయి కోల్ కతా మేయర్ షోవన్ ఛటోపాధ్యాయ మరోమారు విజయాన్ని సాధించారు. 131 వార్డు నుంచి బరిలోకి దిగిన ఆయన తన సమీప ప్రత్యర్థిపై 5500 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. ఈ గెలుపును బెంగాల్ ప్రజలకు అంకితం చేస్తున్నానని ట్విట్టర్ లో పర్కోన్న దీదీ..  నేపాల్ అలుముకున్న విషాదం నేపథ్యంలో పార్టీ నేతలు ఎవరూ విజయోత్సవ ర్యాలీలు నిర్వహంచరాదని, వాటికి దూరంగా వుండాలని కోరింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles