AAP | Jithender singh | Fake | Certificate | University

Aap judicial minister jithender singh fake certificate from the university

AAP, Jithender singh, Fake, Certificate, University, delhi, kejriwal, Judicial minister

AAP Judicial minister jithender singh fake certificate from the University. The University clear that the judicial minister did not studdied in their university in the past. And also said that the minister had fake certificates.

మంత్రిగారి సర్టిఫికేట్లు డూప్లికేట్.. హైకొర్టుకు నివేదించిన యూనివర్సిటి

Posted: 04/28/2015 04:41 PM IST
Aap judicial minister jithender singh fake certificate from the university

పాపం.. ఆప్ పార్టీ టైం అస్సలు బాగున్నట్లు లేదు. అందుకే వివాదాల వెనుక వివాదాలు ఆప్ ను విమర్శల పాటుచేస్తున్నాయి. ఆప్ ర్యాలీలో ఓ యువరైతు ఆత్మహత్య చేసుకుంటున్నా.. ర్యాలీని ఆపకుండా ఆప్ నేతలు చేసిన ఉత్సాహం పార్టీని విమర్శలకు గురిచేసింది. కనీసం ఆ వివాదం ముగిసింది అని అనుకుంటున్న తరుణంలోనే తాజాగా మరో వివాదానికి ఆప్ కేంద్ర బిందువుగా మారింది. ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ విద్యార్హత సర్టిఫికెట్లన్నీ నకిలీవేనని యూనివర్సిటీ స్పష్టం చేసింది. బీహార్లోని తిలక్ మాంఝీ భాగల్పూర్ యూనివర్సిటీలో తాను చదివినట్లు మంత్రి తోమర్ సర్టిఫికెట్ చూపించగా.. అది నకిలీదని పేర్కొంటూ సదరు యూనివర్సిటీ తన నివేదికను హైకోర్టుకు సమర్పించింది. దీంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇరకాటంలో పడ్డారు. మంత్రి జితేందర్ సింగ్  తోమర్ విద్యార్హతల్ని ప్రశ్నిస్తూ , రికార్డుల్లో ఆయన పేర్కొన్న లా సర్టిఫికెట్ నకిలీదిగా పేర్కొంటూ.. దీనిపై ఆగస్టు 20వ తేదీలోగా దీనిపై సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశించింది.  

తమ  యూనివర్సిటీ రికార్డుల్లో ఆయన పేరు లేదని, ఆ సీరియల్ నెంబరుతో వేరే వ్యక్తి  పేరు నమోదై ఉందని తేల్చిచెప్పింది. దీంతో ప్రతిపక్షాలకు తాయిలం దొరికినట్టయింది. న్యాయశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్,   బీజేపీ డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ఆప్ బహిష్కృత నేతలు కూడా మండిపడుతున్నారు. తక్షణమే న్యాయశాఖ మంత్రిని తొలగించకపోతే  ఢిల్లీ సెక్రటేరియట్ ముందు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపడతామని ప్రశాంత్ భూషణ్ తదితరులు హెచ్చరించారు. అలాంటి వ్యక్తిని న్యాయశాఖమంత్రిగా కొనసాగించడంపై ఆప్ ప్రభుత్వాన్ని బీజేపీ తప్పు బట్టింది. ఆప్ ర్యాలీ తర్వాత ఆప్ పరిస్థితి కాస్త దారుణంగా తయారైతే మూలిగే నక్క మీద తాటికాయ చందంగా న్యాయశాఖ మంత్రి వివాదం ఆప్ ను మరింత ఇరకాటంలో పెట్టేస్తోంది. మరి ఆప్ నేతలు ఈ వివాదం నుండి ఎలా బయటపడతారో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AAP  Jithender singh  Fake  Certificate  University  delhi  kejriwal  Judicial minister  

Other Articles