high court takes special investigative team into its purview

Sheshachalam encounter high court hand over police case dairy

high court, encounter in chitoor district, 20 red sandalwood smugglers killed encounter in chandragiri, tamilnadu smugglers killed in encounter, Ap police and forest department joint operation,, encounter in andhra pradesh, Red sandal wood smugglers killed in encounter, Andhra Pradesh, NHRC, Tamilnadu smugglers, SIT, special investigative team

sheshachalam encounter high court hand over police case dairy and takes special investigative team into its purview

స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్.. ఇక హైకోర్టు అధీనంలోకి..

Posted: 04/28/2015 03:47 PM IST
Sheshachalam encounter high court hand over police case dairy

చిత్తూరు జిల్లా తిరుపతి శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారన్న అభియోగాలపై 20 మంది స్మగర్లను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన ఘటనపై హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్కౌంటర్పై ప్రభుత్వం నియమించిన సిట్ను న్యాయస్థానం తన ఆధీనంలోకి తీసుకుంది. 60 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని హైకోర్టు ఈ సందర్భంగా సిట్ను ఆదేశించింది. సిట్ సభ్యులపై అభ్యంతరాలు ఉంటే ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని ఆదేశించింది. శేషాచలం ఎన్కౌంటర్ కేసు డైరీని న్యాయస్థానం స్వాధీనం చేసుకుంది. అలాగే పోలీసులు దాఖలు చేసిన కేసు డైరీపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అవసరమైతే స్పెషల్‌ ప్రాసిక్యూటర్‌ను నియమిస్తామని పేర్కొంది. పోస్టుమార్టం రిపోర్టును బయటపెట్టడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం ఎన్‌కౌంటర్‌పై నివేదికను హైకోర్టుకు అందజేసింది.

ఐజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేసిన ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇందులో 8 మంది పోలీసు అధికారులకు స్థానం కల్పించింది. సిట్ సభ్యులుగా కర్నూలు రేంజి డీఐజీ రమణకుమార్, ఎస్పీ పాలరాజు, పశ్చిమగోదావరి జిల్లా ఏఎస్పీ చంద్రశేఖర్, సీఐడీ డీఎస్పీ యుగంధర్ బాబు, కే రఘు, కోరుకొండ సీఐ మధుసూదన్, చిత్తూరు సీఐ చంద్రశేఖర్ ఉన్నారు.  కాగా ఏప్రిల్ 9న చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో తమిళనాడుకు చెందిన 20 మంది కూలీలు మృతిచెందిన విషయం తెలిసిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sheshachalam encounter  hearing  high court  SIT  

Other Articles