Earthquake death toll could reach 10,000, says Nepal PM Sushil Koirala

Nepal quake toll could reach 10 000 government on war footing says pm sushil koirala

Nepal quake toll could reach 10,000, Nepal PM Sushil Koirala, Disaster, earthquake, epicentre, IMD, India, Indian Meteorological Department, Nepal, PM Narendra Modi, Richter scale, tremors, Varanasi, World

The death toll from Nepal's devastating earthquake could reach 10,000, the prime minister said on Tuesday, as residents frustrated by the government's slow response used their bare hands to dig for signs of their loved ones.

నేపాల్ పై ప్రకృతి పగబట్టింది.. మృతుల సంఖ్య పది వేలకు పెరగోచ్చు..

Posted: 04/28/2015 02:10 PM IST
Nepal quake toll could reach 10 000 government on war footing says pm sushil koirala

నేపాల్‌లో వరుస భూప్రకంపనలతో ప్రజలు అల్లాడుతున్నారని... శనివారం నుంచి దాదాపు 60సార్లు కంపించిన భూమి.. ప్రళయాన్ని సృష్టించిందని, ఈ నేపథ్యంలో ఇప్పటికే 4 వేల 500లకు చేరిన మృతుల సంఖ్య మరింత పెరిగి పదివేల వరకు చేరుకుంటుందని నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాల అందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి ప్రకోపంతో చెల్లచెదురైన తమ వారి జాడను తెలుసుకునే నేపథ్యంలో స్థానికులే.. శిధిలాలను తోలగిస్తున్నారని, ప్రభుత్వం నత్తనడకన చర్యలు చేపడతుందన్నవిమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో ఆయన మీడియా ముందుకు వచ్చారు.

ప్రభుత్వం యుద్దప్రాతిపదికన చర్యలు చేపడుతుందని, వరుసగా ప్రకృతి ప్రకోపాల నుంచి బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేయాల్సిన దానికన్నా వేగంగా చర్యలను తీసుకుందని చెప్పారు. అనేక చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కసారిగా వరుస విపత్తులు మీదపడటంతో సహాయక చర్యలను ఒక సవాల్ గా తీసుకుంటున్నామని, ప్రస్తుతం నేపాల్ అత్యంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోంటుందని అన్నారు. శిధిలాల కింద వున్న వారిని భయటకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటుందన్నారు.

భూకంప తీవ్రతలో దాగిన 20 అణుబాంబుల శక్తి

చారిత్రక నిర్మాణాలను నేలమట్టం చేసి.. వేల మంది ప్రాణాలను బలి తీసుకున్న నేపాల్‌ భూకంపం తీవ్రత ఎంత? రిక్టర్‌ స్కేలుపై 7.8గా నమోదైన తీవ్రత వెనుక  20 థర్మో న్యూక్లియర్‌ హైడ్రోజన్‌ బాంబులు పేలితే ఉత్పన్నమయ్యే శక్తితో సమానమని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. హిరోషిమా నగరాన్ని సర్వనాశనం చేసిన అణుబాంబు కన్నా అనేక రెట్లు శక్తిమంతమైనదని వివరిస్తున్నారు. రెండు కోట్ల 80 లక్షల జనాభా కలిగిన నేపాల్‌లోనే అత్యంత అధిక జనసాంద్రత కలిగిన ఆ దేశ రాజధాని ఖాట్మండుకు కేవలం 40 మైళ్ల దూరంలో భూకంప కేంద్రం ఉండటం.. భూమి పైపొర నుంచి కేవలం 10-15 కిలోమీటర్ల లోతునే భూకంపం రావడం వల్ల దాని తీవ్రత భారీస్థాయిలో ఉందని, మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని వారు అభిప్రాయపడ్డారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : quake death toll  Nepal Prime Minister  Sushil Koirala  

Other Articles