Nepal earthquake: SpiceJet cuts airfare to Re 1, set to operate 2 more flights to Kathmandu

Spicejet cuts fare to operate 2 more flights to kathmandu

spicejet, spicejet offers 2015, spicejet cuts airfare, spicejet sale, spicejet flights to nepal, spicejet flights to kathmandu, earthquake in nepal, earthquake in kathmandu, nepal earthquake, flights to kathmandu, spicejet kathmandu flights, spice jet news, Relief flights, Nepal, Earthquake

SpiceJet today cut down its base fare for its evening flights to Kathmandu to Re 1 to aid evacuation of travellers stranded by the earthquake in Nepal.

భూకంప బాధితుల పట్ల స్సైస్ జెట్ ఔదార్యం..

Posted: 04/28/2015 01:25 PM IST
Spicejet cuts fare to operate 2 more flights to kathmandu

కాకావికళమైన భూతలస్వర్గం నేపాల్ లో .. ప్రకృతి ప్రకోపం జడలు విప్పి విధ్వంసం చేయడంతో.. క్షణాల్లో తమ కళ్ల ముందు చోటుచేసుకున్న పరిణామాలతో ధు:ఖ సాగరంలో మునిగిన మన దేశీయులను తీసుకురావడంతో చౌకధర విమానయాన సంస్థ స్పైస్ జెట్.. తన ఔదార్యన్ని చూపింది. విషాదసాగరంలో మునిగి.. కట్టబట్టలతో విఘత జీవులుగా మారిన బాధితులను ఒక్క రూపాయి ధరకే తీసుకురానున్నట్లు ప్రకటించింది. నేపాల్‌కు రెండురోజుల పాటు సాయంత్రం సర్వీసుల టికెట్‌ బేస్‌ ధరను రూపాయికి తగ్గిస్తున్నట్లు స్పైస్‌జెట్‌ ప్రకటించింది.

ప్రస్తుతం నేపాల్‌కు నడుపుతున్న రెండు విమానాలు కాకుండా, అక్కడ చిక్కుకున్న భారతీయుల తరలింపునకు సాయంకాల వేళల్లో మరో రెండు ప్రత్యేక విమానాలను నడపనున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక విమానాల వివరాల కోసం ఎన్‌జిఒలు, ఇతర సహాయక సంస్థలను సంప్రదించాలని పేర్కొంది. దీంతోపాటు దేశీయంగా 1.5 లక్షల సీట్లను 999 రూపాయలకే అందించనున్నట్లు కంపెనీ విడిగా మరో ప్రకటనలో తెలిపింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Earthquake India Kathmandu Nepal SpiceJet  Relief flights  

Other Articles