Hack eye | Whatsapp | Police | Hydearabad | Cyberabad

Police useing whatssapp hack eye to solve problems

Hack eye, Whatsapp, Police, Hydearabad, Cyberabad,

Police useing whatssapp, hack eye to solve problems. IN hyderabad and cyberabad police useing the whatsapp, hack eye tech.

అటు వాట్సాప్.. ఇటు హ్యాక్ ఐ.. పోలీసుల టెక్నిక్

Posted: 04/28/2015 01:06 PM IST
Police useing whatssapp hack eye to solve problems

కనిపించే మూడు సింహాలు న్యాయానికి, నీతికి, నిజాయితీకి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమే పోలీస్ అనే సాయి కుమార్ డైలాగ్ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అయితే పోలీసులు కేసులను పరిష్కరించడానికి ఎంతో కష్టపడుతుంటారు. అయినా పోలీసుల సేవలపై మాత్రం విమర్శలు వస్తూనే ఉంటాయి. అయినప్పటికీ పోలీస్ సర్వీసులను ప్రజలకు మరింత చేరువ చెయ్యడానికి పోలీస్ శాఖ కొత్త కొత్త ప్రయోగాలను చేస్తోంది. అందులోఒకటి వాట్సాప్, రెండు హ్యాక్ ఐ. ఇటు హైదరాబాద్… అటు సైబరాబాద్… రెండు కమిషనరేట్లు స్టార్ట్ చేసిన సర్వీసులివి. సైబరాబాద్ పోలీసులు వాట్సాప్ నంబర్ ని అందుబాటులోకి తీసుకొస్తే… హైదరాబాద్ పోలీసులు హ్యాక్ ఐని తీసుకొచ్చారు. వీటికి జనం నుంచి రెస్పాన్స్ ఫుల్ గా నే వస్తోంది. కానీ రిజల్ట్ మాత్రం అనుకున్నంత కనిపించని పరిస్థితి.

హ్యాక్ ఐ స్టార్టైన నాలుగు నెళ్లలో 2 వేల 26 కంప్లైంట్స్ చేశారు జనం. పోలీసులు పరిష్కరించింది మాత్రం 6 వందల 9 మాత్రమే. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన కేసులు, మహిళలపై వేధింపులతో పాటు పోలీసులపై కూడా హ్యాక్ ఐ ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు జనం. అయితే, పోలీసులపై వచ్చిన కంప్లైంట్స్ తో వారి అందరిమీదా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పరిష్కారం కాని మిగతా కేసులు పైనా కాన్సంట్రేట్ చేశామంటున్నారు. ఇటు వాట్సాప్ పరిస్థితి కూడా ఇంచుమించు అంతే. వాట్సాప్ కి కంప్లైంట్స్ సంఖ్య మరికాస్త పెరిగింది. ప్రతీ క్రైమ్ ని వీడియోనో, ఫోటోనో తీసి పోస్ట్ చేస్తున్నారు జనం. పోలీసులు కూడా వీటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామంటున్నారు. మొత్తానికి పోలీసింగ్ విత్ టెక్నాలజీ అంటే ఇదే మరి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hack eye  Whatsapp  Police  Hydearabad  Cyberabad  

Other Articles