Sakshi maharaj makes another time controversial comments on rahul gandhi | nepal earthquake

Sakshi maharaj controversial comments rahul gandhi nepal earthquake kedarnath

sakshi maharaj, rahul gandhi, bjp party, sakshi maharaj controversy, kedarnath temple, congress party news, sushmita dev congress member, nepal earthquake, nepal tragedy

Sakshi maharaj controversial comments rahul gandhi nepal earthquake kedarnath : Bjp Mp sakshi maharaj makes controvesial comments on rahul gandhi. He said that rahul is the main reason for nepal earthquake. Because he vistis kedarnath without bathing

రాహుల్ చేసిన పాపమే ‘భూకంపా’నికి కారణం!

Posted: 04/28/2015 12:58 PM IST
Sakshi maharaj controversial comments rahul gandhi nepal earthquake kedarnath

నేపాల్ లో భారీ భూకంపం సంభవించిన నేపథ్యంలో ఇటు భారత్ లోనూ దాటి ఉధృత వ్యాపించిన విషయం విదితమే! దాని ఎఫెక్ట్ తో ఢిల్లీ నుంచి విజయవాడా దాకా భూప్రకంపనలు వచ్చాయి. అయితే.. ఇంత భీభత్సకరమైన భూకంపం రావడానికి కారణం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీయే కారణమట! ఈ వ్యాఖ్యలు చేసింది మరెవ్వరో కాదు.. వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బీజేపీ ఎంపీ సాక్షీ మహరాజ్! ఇప్పటికే తన వివాదాస్పద వ్యాఖ్యలతో పలుమార్లు బీజేపీ అధిష్టానాన్ని ఇబ్బందుల్లో పెట్టిన ఈయన.. తాజాగా మరో వివాదానికి తెరదీశారు.

గొడ్డు మాంసం తినే రాహుల్ గాంధీ.. పరమ పవిత్రమైన కేదార్ నాథ్ కు వెళ్లినందువల్లే ఇంతటి ప్రళయ భూకంపం సంభవించిందని సాక్షీ మహరాజ్ ఆరోపించారు. ‘రాహుల్ గాంధీ గొడ్డుమాంసం తింటారు. శుద్ధి చేసుకోకుండానే పవిత్ర ఆలయాలకు వెళ్లారు. ఆయన చేసిన ఆ ఘోర పాపం కారణంగానే భూకంపం వచ్చింది’ అంటూ ఆయన హరిద్వార్ లో వ్యాఖ్యానించారు. ఈయన ఈ విధంగా కామెంట్లు చేసిన నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. ప్రధాని మోదీ, అమిత్ షా దగ్గరుండి ఈ విధమైన నీచ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ ప్రతినిధి సుష్మితా దేవ్ విరుచుకుపడ్డారు. తక్షణం సాక్షీ మహారాజ్ పై చర్యలు తీసుకోవాలన్నారు.

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడమేకాకుండా పార్టీకి ముప్పతిప్పలు తెప్పిస్తున్న సాక్షీ మహరాజ్ ని బీజేపీ గతంలో చాలాసార్లు హెచ్చరించింది. పార్టీని ఇబ్బందుల్లో పెట్టే వ్యాఖ్యలు చేయొద్దని ఆయన్నీ బీజేపీ మందలించినా.. ఆయన మాత్రం తన తీరు మార్చుకోకుండా వివాదాలకు తెరలేపుతున్నారు. తాజాగా భూకంపం మీద ఆయన వ్యాఖ్యలు చేయడం, ఆ పార్టీని దిగజార్చేందుకు కాంగ్రెస్ కి అరుదైన అవకాశంలా మారింది. మరి.. ఈ వివాదం బీజేపీని ఏమేరకు ఇబ్బందులు తెచ్చిపెడుతుందో.. దాన్ని ఆ పార్టీ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sakshi maharaj  rahul gandhi  nepal earthquake  

Other Articles