karunanidhi | Jayalalitha | Elections | Tamilnadu Supreme court

Karunanidu express happy on suprene court order for jayalalitha case

karunanidhi, jayalalitha, elections, tamilnadu, supreme court

karunanidu express happy on suprene court order for jayalalitha case. Supreme court order to reveal judgement on the case of jayalalitha assets.

కరుణానిధీ.. ఏందీ సంబరం.. చాల్లే..!

Posted: 04/27/2015 04:08 PM IST
Karunanidu express happy on suprene court order for jayalalitha case

మనం బాగుపడకపోయినా పర్లేదు కానీ పక్కవాడు మాత్రం చెడిపోవాలి అని అనుకోడమే ఇండియన్ సైకాలజీ అని ఓ సినిమాలో పోసాని కృష్ణ మురళీ చెప్పిన డైలాగ్. అయితే ఈ డైలాగ్ కు కాస్త అటో ఇటో కానీ దాదాపుగా అందరం న్యాయం చేస్తాం. అందులోనూ రాజకీయ నాయకులు అయితే నూటికి నూటయాభై శాతం నిజం చేస్తారు. తాజాగా కరుణానిధి పార్టీ వ్యవహారం చూస్తే ఎందుకో ఈ వ్యాఖ్యలకు సరిపోతాయేమో అని అనుమానం కలుగుతోంది. తాజాగా జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల డీఎంకే అధినేత కరుణానిధి హర్షం వ్యక్తం చేశారు. న్యాయం, నిజాయితీ ఎప్పటికైనా గెలుస్తాయని మరోసారి రుజువైందని ఆయన అన్నారు. జయలలిత కేసును వాదించేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక పబ్లిక్ ప్రాసీక్యూటర్ను నియమించడాన్ని తప్పుబట్టడంతో పాటు.. ఇప్పటివరకు ఈ కేసులో జరిగిన వాదోపవాదాలు చాలని, ఇక తీర్పును వెల్లడించవచ్చని కర్ణాటక హైకోర్టుకు సుప్రీంకోర్టు తెలియజేయడమే కాకుండా గతంలో ఈ విషయంపై ఉన్న స్టేను ఎత్తివేసింది. మొత్తానికి కరుణనిధి నిజంగా న్యాయం గెలిచిందని భావిస్తున్నారో లేక తమ రాజకీయ ప్రత్యర్థికి కోర్టు వ్యతిరేకంగా తీర్పునిచ్చిందని సంతోషిస్తున్నారో అతనికే తెలియదు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : karunanidhi  jayalalitha  elections  tamilnadu  supreme court  

Other Articles