Baby | Jharkhand | Ganesha | Fourhands | Fourlegs

A baby born with four arms and four legs

baby, ganesha, religious, hindu, god, jharkhand, india,

Thousands of religious devotees have flocked to see a baby born with eight limbs to worship him as a Hindu God.The baby boy, who has not yet been named, was born with four legs and four arms - thought to be the result of a birth defect from an underdeveloped conjoined twin.

నాలుగు చేతులు, నాలుగు కాళ్లతో వింత శిశువు.. గణపతి దేవుడంట..!

Posted: 04/27/2015 03:32 PM IST
A baby born with four arms and four legs

మన నానమ్మలో, అమ్మమ్మలో చెప్పో కథల్లో భయంకరమైన రూపంలో ఉండే రాక్షసులను చంపడానికి దేవుళ్లు వస్తుంటారని విన్నాం. ఇలా దేవుళ్లు వివిధ రూపాల్లో వచ్చి వారిని చంపారు అని కూడా విన్నాం. అయితే ఆ కథల్లో దేవుళ్లు నాలుగు చేతులతో, నాలుగు కాళ్లతో వచ్చారని విన్నవాళ్లకు ఇప్పుడు చెప్పబోయే వార్త కొంత వరకు నిజమా అనే అనుమానాన్ని కలిగించవచ్చు. కానీ ఇది అక్షరాల నిజం.. నాలుగు చేతులు, నాలుగు కాళ్లను కలిగిన ఓ వింత శిశువుకు జన్మనిచ్చింది ఓ తల్లి. అయితే ఈ వింత రూపం హిందూ దేవుడైన గణపతి లాగా ఉన్నాడని ఆ నోటా ఈ నోటా ప్రచారం సాగింది. దాంతో జనాలు తండోపతండాలుగా శిశువును చూసేందుకు క్యు కడుతున్నారు. ఇంతకీ అలాంటి వింత శిశువు ఎక్కడ ఫుట్టాడంటే..

baby-with-four-legs-four2

మనదేశంలోని జార్ఖండ్ రాష్ట్రంలోని డుమ్రి ఇస్రీ అనే చిన్న టౌన్ లో ఓ తల్లి వింత శిశువుకు జన్మనిచ్చింది. నాలుగు కాళ్లు, నాలుగు చేతులు కలిగిన చిన్న శిశువు చూడడానికి హిందూ దేవుడు గణపతిలాగా ఉన్నాడని క్షణాల్లో నగరం అంతా తెలిసింది. దాంతో అక్కడ చుట్టుపక్కలున్న వారు ఆ చిన్నారిని చూడడానికి తరలివచ్చారు. అయితే ఆ విషయాన్ని ఏకంగా ఫేస్ బుక్ లో షేర్ చెయ్యడంతో విషయం చాలా స్పీడ్ గా పాపులర్ అయింది. దాంతో చిన్నారిని చూడడానికి అందరూ అక్కడికి చేరుకున్నారు. అయితే చిన్నారి అవిభక్త కవలా, లేక వేరే ఏమైనా సమస్య వల్ల ఇలా జరుగుతుందా అని డాక్టర్లు ఆరా తీస్తున్నారు. అయితే గర్భంలో ఎన్నప్పుడు అండం పూర్తిగా పరిపక్వం కాకుండా.. వేరొక అండంతో కలిసిపోవడం వల్ల ఇలాంటి శిశువులు జన్మించే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు అంటున్నారు. ఏది ఏమైనా గణేశుడే పుట్టాడు అనుకొని చాలా మంది చిన్నారిని చూడడానికి వెళుతున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : baby  ganesha  religious  hindu  god  jharkhand  india  

Other Articles