Another Time Earthquake Caused In Nepal kathmandu | Nepal Death toll rises above 3000

Nepal earthquake tremors kathmandu death toll rises above 3000

nepal earthquake, kathmandu earthquake, nepal crime news, earthquake news, earthquake tremors, indian enforcement department, narendra modi news, nepal prime minister, earthquake magnitude

Nepal Earthquake tremors kathmandu Death toll rises above 3000 : At least 3,218 people are now known to have died in a massive earthquake which hit Nepal on Saturday.

మళ్లీ భూ‘ప్రళయం’తో నే(ల)పాల్.. పెరుగుతున్న మృతులసంఖ్య

Posted: 04/27/2015 10:24 AM IST
Nepal earthquake tremors kathmandu death toll rises above 3000

ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే.. నేపాల్పై ప్రకృతి ప్రకోపం ఇంకా తగ్గనట్లు కనిపిస్తోంది. శనివారం ప్రారంభమైన భూకంపనలు ఇప్పటికీ కొనసాగుతూనే వున్నాయి. ఇప్పటికే ఈ భూ‘ప్రళయం’ ధాటికి అతలాకుతలమైన నేపాల్ లో సోమవారం తెల్లవారుజామున దాదాపు రెండు గంటల ప్రాంతంలో మళ్లీ భూమి కంపిందింది. ఈ తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైంది. దీంతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. గతంలో ఎన్నడూలేని విధంగా వచ్చిన ఈ భూకంపాన్ని తామెన్నడూ చూడలేదంటున్న అక్కడి నివాసులు.. తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కమంటూ గడుపుతున్నారు.

ఇదిలావుండగా.. ఈ భూకంపం ధాటికి ఆర్థికపరంగా ఎంతో నష్టం జరగగా మరోవైపు మృతుల సంఖ్య పెరుగుతూనే వుంది. నిన్నటివరకు 2 వేలకు పైగా వున్న మృతుల సంఖ్య ఇప్పుడు 3వేలకుపైగా పెరిగింది. భూకంపం కారణంగా మరణించిన వారిసంఖ్య 3,218కి పెరిగిందని, దాదాపు 7 వేల మందికిపైగా గాయపడ్డారని స్థానిక పోలీసు అధికారులు ప్రకటించారు. ఇటు భారత్లోనూ మృతుల సంఖ్య  66కు పెరిగిందని అధికారులు చెప్పారు. కఠ్మాండు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ఇళ్లను విడిచి బహిరంగ ప్రదేశాల్లో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్న ప్రజలు తరచూ భూమి కంపిస్తుండటంతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

భారత సైన్యం, జాతీయ విపత్తు నివారణ సంస్థ సిబ్బందితోపాటు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. నేపాల్ లో చిక్కుకుపోయిన వారిలో దాదాపు రెండు వేల మందిని ఇండియన్ ఏయిర్ ఫోర్స్ విమానం ద్వారా భారత్ కు తరలించారు. ఇంకా వేలమంది భారతీయులు కఠ్మాండు విమానాశ్రయంలో ఎదురుచేస్తున్నారు. ఆదివారం నుంచి నేపాల్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nepal Earthquake  Kathmandu News  Narendra Modi  

Other Articles