actor turned politician shivaji angry over central government decision on not giving special status to state

Bjp activists protest before hero shivaji

bjp activists protest before hero shivaji, ap special status, actor shivaji, bjp protest, andhra pradesh, Telangana, special status, bjp, parliament, modi, prime minister narendra modi, ap chief minister chandrababu, union minister venkaiah naidu, union minister rao indrajeet singh, venkaiah on special status, chandrababu on special status, kotha prabhakar reddy, ap special status,

At last the issue of special status to Andhra Pradesh has been clarified in parliament that such a proposal does not exist at all and all the hyped up promises of Venkaiah Naidu and other BJP leaders is now proved to be just a mirage.

నటుడు శివాజీకి పరాభావం.. దాడికి యత్నించిన బీజేపి కార్యకర్తలు

Posted: 04/26/2015 08:24 PM IST
Bjp activists protest before hero shivaji

ప్రముఖ నటుడు శివాజీకి రాజమండ్రిలో చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన శివాజీ మీడియాతో మాట్లాడుతుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. శివాజీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ నేత సోము వీర్రాజుపై వ్యాఖ్యలు చేసినందుకు శివాజీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో శివాజీ అక్కడి నుంచి వెనుదిరిగారు. అయితే.. అక్కడి నుంచి ఆయన బస చేసిన హోటల్ వద్దకు వెళ్లిన బీజేపి నేతలు.. అక్కడ కూడా పెద్ద పెట్టున నినాదాలు చేసి.. ఆందోళనకు దిగారు,

బీజేపీ జాతీయ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడిన నటుడు శివాజీ తక్షణం క్షమాఫణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి శివాజీ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. కాగా అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత 36 గంటలుగా నవ్యాంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ.. సెల్ టవర్ ఎక్కిన సంజీవరావు విషయమై స్పందిస్తూ.. నవ్యాంధ్రకు వస్తే. కేంద్ర మంత్రులను కూడా సెల్ టవర్లు ఎక్కిస్తామని ఘాటు వ్యాఖ్యాలు చేశారు. సంజీవ రావు విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తో మాట్లాడుతున్నానని, ఆయనకు ఎలాంటి హాని కలగకుండా కిందకు దించే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కాగా సంజీవరావు డిమాండ్ లో న్యాయముందని శివాజీ వ్యాఖ్యానించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap special status  actor shivaji  bjp protest  

Other Articles