9-month pregnant woman runs 5 km in Karimnagar

Pregnant woman creates record runs for girl child and talab

pregnant woman creates record, pregnant lady runs for girl child and talab, 9-month pregnant woman runs 5 km in Karimnagar, pregnant woman, 5 kilometers run, telangana book of records, Nine months pregnant, runs for 5 k.m., Karimnagar in Telangana

In a courageous move, a 42-year-old woman Kamarapu Laxmi, who is nine months pregnant, set a new record by running for a distance of 5 kilometers to enter the record books at Ambedkar Stadium.

ఆడశిశివు, చెరువుల కోసం నిండు గర్భిణీ పరుగు. రికార్డు..

Posted: 04/26/2015 04:38 PM IST
Pregnant woman creates record runs for girl child and talab

ఆడవాళ్లు అబలలు కాదు సబలలు అని మరో వనిత.. కాదు కాదు తొమ్మిది నెలలు నిండిన నిండు గర్భిణీ రుజువు చేసింది. ఇక లక్ష్యాన్ని నిర్ధేశించుకుంటే.. దానిని ఎంతటి కష్టమైనా సాధించగలమని నిరూపించింది. కరీంనగర్‌కు చెందిన కామారపు లక్ష్మి(43) అనే తొమ్మిది నెలల గర్భిణీ 5 కిలోమీటర్ల దూరం పరుగెత్తి అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడమేకాదు, 'తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో స్థానం సంపాదించింది. ఆదివారం స్థానిక అంబేద్కర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో 5 కిలోమీటర్ల దూరాన్ని 30 నిమిషాల 20 సెకన్లలో చేరుకుని రికార్డు నెలకొల్పింది.

ప్రత్యక్షంగా తిలకించిన తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఆమెకు గుర్తింపు పత్రం అందజేశారు. నిండు గర్భిణీగా ఉండి, 5 కిలోమీటర్ల దూరం పరుగెత్తటం తెలంగాణ రాష్ట్రంలో ఇదే ప్రథమమని తెలిపారు. గిన్నిస్ బుక్ నిర్వాహకులకు కూడా సిఫారసు చేయనున్నట్లు పేర్కొన్నారు. తల్లి గర్భంలో వున్న అఢ శిశువులను పరిరక్షించాలని కోరుతూ.. గ్రామాల్లోని చెరువులను కూడా పరిరక్షించాలన్న నినాదంతో లక్ష్్మీ చేసిన సాహసాన్ని గ్రామస్థులందరూ ప్రశంసించారు. కాగా క్రీడాకారిణి అయిన లక్ష్మి భర్త రవీందర్ కూడా క్రీడాకారుడే. వారికి మూడేళ్ల కూతురు ఉంది. ఈ వారంలోనే ఆమెకు కాన్పు కానుందని తెలిసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pregnant woman  5 kilometers run  telangana book of records  

Other Articles