india will wipe tears of every nepali modi

India is with nepal in this hour of grief says narendra modi as death toll touches 2 000

india will wipe tears of every nepali modi, India is with Nepal in this hour of grief, Narendra modi, man ki baat, nepal Quake death toll touches 2,000, prime minister man ki baat, earthquake, Mt. everest, india, delhi, bihar, gawhathi, Seviour earth quake in nepal people, earthquake, nepal, Dharahara Tower, Bhimsen Tower, disasters-and-accidents, nepal, Buildings collapse in Kathmandu, earthquake rattles Nepal, earthquake rattles Kathmandu, 110 dead in nepal, 10 dead in india

India on Sunday said it would try its best to "wipe the tears" of the people of Nepal and do all it can to help them tide over the crisis following the devastating earthquake.

నేపాలీ కన్నీళ్లు తూడుస్తామన్న మోడీ, 2000లకు చేరిన మృతుల షంఖ్య

Posted: 04/26/2015 12:44 PM IST
India is with nepal in this hour of grief says narendra modi as death toll touches 2 000

ప్రకృతి ప్రకోపానికి గురై భూతల స్వర్గాన్ని తలపించి ఆధ్యాత్మికతకు, చక్కటి ప్రకృతికి అలవాలంగా నిలచిన నేపాల్ మరుభూమిగా మారిందని భారత ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర అవేదన చెందారు. కన్నీటి సంద్రంలో మునిగిపోయిన ప్రతి ఒక్క నేపాలీయుడి కన్నీళ్లు తూడుస్తామని నరేంద్ర మోదీ అన్నారు. ఆపదలో ఉన్న ఏ దేశాన్నైనా ఆదుకోవడంలో భారత్ ఎప్పుడూ ముందే ఉంటుందని అన్నారు. నేపాల్కు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. పోరుగు రాష్ట్రంతో పాటు భారత్ లోనూ భూ ప్రకంపనలు భీభత్సాన్ని సృష్టించాయన్నారు.

ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన నేపాల్ సోదరుడు, సోదరీ మణులకు భారత్ ఎప్పుడూ అండంగా ఉటుందని చెప్పారు. వారి చేతులను తమ చేతుల్లోకి తీసుకుని ధైర్యం చెప్తామన్నారు. భూకంపంతో తీవ్ర విషాదంలోకి జారిన నేపాల్ ను అదే విషాధాన్ని ఎదుర్కోంటున్నా భారత్.. సాయమందించడంలో ముందునిలుస్తుందన్నారు.. ఈ భూకంపం ఒక్క నేపాల్, భారత్ మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేసిందని చెప్పారు. ఏ రకంగా అవకాశం ఉన్నా సహాయం చేసేందుకు భారత్ పూర్తి సిద్ధమని చెప్పారు.

2000లకు చేరిన నేపాల్ భూకంప మృతుల సంఖ్య

కాగా, నేపాల్లో భూకంప మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పెరుగుతున్న సంఖ్య స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. తాజా నివేదికల ప్రకారం రెండు వేలకు పైగా మృతదేహాలు లభ్యమైనట్టు సమాచారం. ఒక్క ఖాట్మండులోనే వెయ్యి మందికి పైగా మృతి చెందినట్టు సమాచారం. వేలమంది ప్రజలు వెన్నులోకి చీల్చుకుని వెళ్తున్న చలిలోనే వణికిపోతూ.. రోడ్లపైనే జాగారం చేశారు. భూకంపం ధాటికి ఎవరెస్టు శిఖరంపై దాదాపు 18 మంది మరణించారు. ఈ తీవ్ర ధాటికి భారత్లోనే 53 మంది మృతి చెందగా.. 240 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సహాయాన్ని కేంద్రప్రభుత్వం ప్రకటించింది.
 
జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra modi  man ki baat  nepal Quake  

Other Articles