Crying | London | Sarina Aziz

A crying baby stoped the plane in london

baby, crying, london, Sarina Aziz, Ariella, Mark

A crying baby was thrown off a plane with her parents because she posed a security threat. 19-month-old Sarina Aziz became agitated when cabin crew insisted she sit on the lap of one of her parents as the Luton-bound plane prepared for take off from Tel Aviv.

పాప ఏడ్చింది.. సైరన్ మోగింది.. ఏకంగా ఫ్లైట్ ఆగింది

Posted: 04/25/2015 03:52 PM IST
A crying baby stoped the plane in london

పాప ఏడ్చింది అంటే వుడ్ వర్డ్స్ పట్టండి అని అందామనుకుంటున్నారా.. అదేం కుదరదు ఎందకంటే అక్కడ సీన్ వేరేలా ఉంది. లండన్ నుండి బయలుదేరిన ఓ ఫ్లైట్ మధ్యలో అకస్మాత్తుగా ఆగిపోయింది. ఇంతకీ అసలు అంత ఎమర్జెన్సీగా ష్లైట్ ఎందుకు ల్యాండ్ అయిందో తెలిస్తే నిజంగా ఆశ్చర్య పోతారు. ఎందకంటే ఫ్లైట్ లో ఉన్న ఓ 19 నెలల చిన్నారి ఏడిచింది. అవును చిన్నారి ఏడిచిందని ఏకంగా ఫ్లైట్ నే ఆపేశారు. విషయం ఏమిటో తెలియాలంటే ఈ అప్ డేట్స్ చూడండి..

అరియల్లా, మార్క్ అనే జంట తమ పాప సరీనా అజీజ్ తో కలిసి లండన్ ఫ్లైట్ లో బయలుదేరారు. అయితే ఫ్లైట్ మొదలైనప్పటి నుండి ఏడుస్తూనే ఉంది. ఎంతలా సముదాయించినా.. పాప మాత్రం శాంతించ లేదు. దాంతో ఫ్లైట్ నడుపుతున్న పైలెట్లు ఏకంగా ఎమర్జన్సీ ల్యాండింగ్ కు సిగ్నల్ ఇచ్చేశారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నాము.. జాగ్రత్తగా ఉండండి అంటూ సైరన్ కూడా మోగించేశారు. అలా హుటాహుటిన కిందికి దిగిన ఫ్లైట్ సరీనా అజీజ్, ఆమె తల్లిదండ్రులను ప్లైట్ నుండి దించేశారు. అయితే మామూలుగా కూడా కాదు పోలీసులను పిలిచిమరీ దింపేశారు. అసలు చిన్న పాప ఏడిస్తే దానికి ఏదో జరిగిపోయినట్లు ల్యాండ్ చెయ్యడం, పోలీసులతో గెంటించడంపై సరీనా అజీజ్ తల్లిదండ్రులు మండిపడ్డారు. ఫ్లైట్ లో టెర్రరిస్టులు పడ్డట్లు ఎమర్జెన్సీ సైరన్ మోగించడం ఏంటని కూడా అంటున్నారు. మొత్తానికి ఓ చిన్న పాప ఏడుపు ఎంతో మందితో ప్రయాణిస్తున్న విమానాన్ని ఆపేసింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : baby  crying  london  Sarina Aziz  Ariella  Mark  

Other Articles