union ministry does not recommand special status to ap, telangana

Ap special status bubble burst in parliament

andhra pradesh, Telangana, special status, bjp, parliament, modi, prime minister narendra modi, ap chief minister chandrababu, union minister venkaiah naidu, union minister rao indrajeet singh, venkaiah on special status, chandrababu on special status, kotha prabhakar reddy, ap special status, telangana special status,

At last the issue of special status to Andhra Pradesh has been clarified in parliament that such a proposal does not exist at all and all the hyped up promises of Venkaiah Naidu and other BJP leaders is now proved to be just a mirage.

ఏమార్చడమే మార్పా..? ప్రత్యేక హోదా ఇక రాదా..?

Posted: 04/24/2015 09:25 PM IST
Ap special status bubble burst in parliament

ఏరు దాటక ముందు ఓడ మల్లయ్య..ఏరు దాటాక బోడి మల్లయ్య అన్నట్టుగా వుంది బీజేపీ వ్యవహారం. ఆర్థికంగా చితికిపోయిన నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా గురించి ఇన్నాళ్లు చేస్తాం.. చూస్తాం అంటూ మభ్యపెడుతూ వచ్చిన కేంద్రం ఇప్పుడు ఏకంగా ప్రత్యేక హోదా లేదని కుండబద్దలు కొట్టింది. ఆంధ్రప్రదేశ్‌ నోట్లో మట్టి కొట్టింది. అటు తెలంగాణ కు కూడా ప్రత్యేక ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. దేశంలో మార్పును తీసుకువస్తామని చెప్పి.. ప్రజలను మభ్యపెట్టి, అధికారంలోకి వచ్చిన బీజేపి ప్రభుత్వం, నరేంద్రమోడీ సర్కారు.. ద్వంద నీతిని ప్రదర్శించింది. ప్రజలను ఏమార్చడంతోనే మార్పు సాధ్యమని బావిస్తున్నట్లుగా వుంది.

 

లిఖితపూర్వకంగా తేల్చిచెప్పిన మంత్రి రావ్ ఇంద్రజీత్ సింగ్..

ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తుండగా..ఇక ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదని కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి రావుఇంద్రజిత్‌సింగ్‌ తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన లోక్‌సభ సభ్యులు మాగంటి బాబు..కొత్త ప్రభాకర్‌రెడ్డిలకు తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కావాలని అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి రావుఇంద్రజిత్‌సింగ్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రత్యేక హోదాపై ఇక ఆశలు వదులుకోవచ్చని కూడా స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోరుతూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి అభ్యర్ధనలు అందాయని.. అయితే 14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల తర్వాత ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదని మంత్రి చెప్పారు.

మోడీ నామస్మరణకే వెంకయ్య ప్రాధాన్యం

రాష్ట్ర విభజన అంశంపై ప్రతిపక్షంలో వుండి వీరోచితంగా పోరాడిన వెంకయ్యనాయుడు రాజ్యసభలో బిల్లు అమోదానికి వచ్చినప్పుడు తన సత్తాను చాటాడు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5 ఏళ్లు చాలదు.. 10 ఏళ్లు కావాలని డిమాండ్‌ చేశారు. బిల్లులో ఈ అంశాన్ని పెట్టాలని డిమాండ్ చేయడంతో. వెంకయ్య ఒత్తడి మేరకు అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ స్వయంగా రాజ్యసభలో ఈ మేరకు ప్రకటన కూడా చేశారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. అదే వెంకయ్యనాయుడు ఇప్పుడు కేంద్రంలో కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తూ కూడా చక్రం తిప్పులేక పోతున్నారు. నిత్యం ప్రధాని నరేంద్ర మోడీ నామస్మరణకు సమయాన్ని కేటాయించడానికే ఆయన సమయాన్ని కేటాయిస్తున్నారు. అసలు రాష్ట్రానికి విభజన చట్టం కింద రావాల్సిన ప్ర్రప్రథమ డిమాండ్ ప్రత్యేక హాదాపై ఆయన అసలు శ్రద్ద తీసుకోవడమే లేదు. ప్రధాని నరేంద్రమోడీ ఏ పని చేసినా ఆయనను ప్రశంసించడం, అయనను కాదన్న వాళ్లను విమర్శించడంతోనే వెంకయ్య బిజీగా మారారన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి

 



ఎన్నికల ముందు ప్రచారాస్త్రాం.. అనక అస్త్ర సన్యాసం..

సార్వత్రిక ఎన్నికలతో పాటు జరిగిన నవ్యాంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. రాష్ట్రాన్ని పునర్విభజించిన కాంగ్రెస్ ను దోషిని చేసిన టీడీపీ, బీజేపీ పార్టీలు తమ వల్లే.. పునర్విభజన బిల్లులో పెట్టిన అంశాలన్ని నేరవేరుతాయని ప్రచారం చేశారు. ఊరూరా కరపత్రాలను పంచారు. రాష్ట్రాన్ని సమగ్రంగా విభజించడంలో కాంగ్రెస్ విఫలమైందని, ఈ తరుణంలో తమకు ఓటేస్తేనే రాష్ట్రాన్ని అభివృద్ది పరుస్తామని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడం కూడా తమ వల్లే సాధ్యమవుతుందని, రానున్నదని నరేంద్రమోడీ ప్రభుత్వమని, మోడీ ప్రభుత్వాన్ని ఒప్పించి, తాము రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించగలమని టీడీపీ తరపున చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు. బీజేపి తరపున వెంకయ్యనాయుడు సహా బీజేపీ రాష్ట్ర నేతలు ఊదరగోట్టే ప్రచారం చేశారు.

అదిరిపోయే ప్రసంగాలను చేశారు. తీరా అధికారంలోకి వచ్చిరాగానే హామీల విషయంలో తమకేమీ తెలియదన్నట్లు అస్త్ర సన్యానం చేసినట్లు మారిపోయారు. ప్రత్యేక హాదా అంటే ఏమిటన్నట్లుగా మాటామార్చారు. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటే మిగిలిన అన్ని రాష్ట్రాలు అంగీకరించాలని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అందుకే అది సాధ్యపడదని చెబుతున్నారు. కేంద్ర మంత్రిగా, జాతీయ స్థాయి సీనియర్ నాయకుడిగా, బీజేపి జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన వెంకయ్య నాయుడు సహా ఉమ్మడి రాష్ట్రానికి తోమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం తనకే వుందని ఊదరగోడుతున్న చంద్రబాబులకు ఈ విషయం ముందు తెలియదా..? లేక తెలిసే ప్రజలను బురడీ కోట్టించారా..? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

 



నరేంద్ర మోడీ హామీ మరిచారు..


బీజేపి ఎన్నికల మానిఫెస్టోలో పోందుపర్చిన అంశంపై చేతులేత్తేయడాన్ని నవ్యాంధ్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పటి ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ సహా బీజేపీ నేతలందరూ వరుస క్రమంలో నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా తీసుకురావడం మా వల్లే సాధ్యమని స్వయంగా నరేంద్రమోడీ హాజరైన తిరుపతి సభలో ఊదరగోట్టారు. అంతేకాదు నరేంద్ర మోడీ సైతం తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేవ్‌ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తిరుపతి ఎన్నికల బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ఢిల్లీకి మించిన రాజధాని నిర్మాణానికి ఏపీకి నిధులిస్తామన్నారు. 16000 కోట్ల లోటు బడ్జెట్‌ను పూడ్చుతామని.. రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తామని..ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు..సాగునీటి సౌకర్యాలకు ప్రత్యేక నిధులు ఇస్తామని మోడీ చెప్పారు. అయితే అధికారంలోకి రాగానే వారిచ్చిన హామీలన్నింటిని మర్చిపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap special status  telangana special status  rao Indrajeet singh  

Other Articles