NDA | Special status | Modi | AP | Chandrababu

The nda govt clear that ap will not get special status

special status, chandrababu, venkiah naidu, modi, status, TDP, BJP, Bifercation, andhrapradesh, industrial policy, manmohan singh

The NDA govt clear that ap will not get special status. The modi govt clear its opinion on special status to andhrapradesh. After bifercation ap facing many problems, so last upa govt promise to give special status for andhra pradesh.

ITEMVIDEOS: పార్లమెంట్‌ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం.. ప్రత్యేక హోదా లేదంట..!

Posted: 04/24/2015 05:00 PM IST
The nda govt clear that ap will not get special status

ఏపికి ప్రత్యేక హోదా కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తోంది. అయితే అదిగో పులి.. ఇదిగో తోక అన్న చందంగా ప్రత్యేక హోదా ఇస్తాం అంటూ ఊరిస్తూ చివరకు ప్రత్యేక హోదా కల్పించడం కుదరదు అని తేల్చేసింది. అయితే ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉంటున్న తెలుగుదేశం పార్టీ ఎన్డీయే ప్రభుత్వం నుండి ఎలాగైనా ప్రత్యేక హోదా సాధిస్తుందని అనుకున్న వారికి ఇది చేదు వార్తే. తెలుగు రాష్ర్టాన్ని రెండు రాష్ట్రాలుగా విభజించిన కేంద్రం.. విడిపోయిన తెలుగు రాష్ట్రం ఏపికి ప్రత్యేక హోదా కల్పించేందుకు అప్పటి యుపిఎ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే తరువాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ప్రత్యేక హోదాపై కాలయాపన చేసింది. వెంకయ్య నాయుడు లాంటి నాయకులు కూడా ఏపికి ప్రత్యేక హోదా చాలా అవసరం అని అన్నారు. కానీ అదే.. వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదాకు అన్ని రాష్ట్రాల అనుమతి కావాలని, అది అంత ఆశామాషీ వ్యవహారం కాదు అని కూడా  అన్నారు. ఇలా ఎన్డీయే ప్రభుత్వం ముందు నుండి ఏపి ప్రత్యేక హోదాపై రకరకాలుగా మాట మారుస్తోంది.

పార్లమెంట్‌ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగింది. ఏపీకి ప్రత్యేక హోదా లేనట్టే అని కేంద్రం తేల్చేసింది. శుక్రవారం లోక్‌సభలో ఇరురాష్ర్టాలకు సంబంధించిన ఎంపీలు కొత్తప్రభాకర్‌రెడ్డి, మాగంటిబాబు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వకంగా కేంద్రం సమాధానం ఇచ్చింది. ప్రత్యేక హోదాపై ఆశలు వదులుకోవచ్చని ప్రణాళికశాఖ మంత్రి రావుఇంద్రజిత్‌సింగ్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే 11 రాష్ర్టాలకు అప్పటి ఎన్డీసీ(నేషనల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్) ప్రత్యేక హోదా ఇచ్చిందన్నారు. ప్రత్యేక హోదాకు ఇచ్చేందుకు కావాలసిన ఐదు అర్హతలను ఈ సందర్భంగా ఇంద్రజిత్‌ ప్రస్తావించారు. 14 ఆర్థిక సంఘం సిఫార్సుల తర్వాత ఏ రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదు.

14వ ఆర్థిక సంఘం సిఫార్సులను పరిగణలోకి తీసుకున్న కేంద్రం గత బడ్జెట్‌లో పలు కేంద్ర పథకాలను ఉపసంహరించుకుందని, కేంద్రం ఇచ్చే నిధులను తగ్గించిందన్న విషయాన్ని ఇంద్రజిత్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రత్యేక హోదా పొందిన 11 రాష్ర్టాలు కూడా బయట నుంచి ఆర్థిక సాయం పొందే పథకాలకు కేంద్రం 90 శాతం నిధులను అందజేస్తుందని ఆయన తెలిపారు. ప్రత్యేక హోద కోరుతూ ఏపీ, తెలంగాణ నుంచి అభ్యర్థనలు అందయాన్న విషయాన్ని ఇంద్రజిత్‌ చెప్పారు. ఈ క్రమంలో 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఇక ఏ రాష్ర్టానికి ప్రత్యేక హోదా దక్కదని కేంద్రం స్పష్టం చేసింది.

దీంతో ఏపీకి ప్రత్యేక హోదా అందరూ ఎదురుచూస్తున్న నేపథ్యంలో రావు ఇంద్రజిత్‌ ఇచ్చిన సమాధానం నిరాశను కలిగించింది. ఇటీవల ఏపీ భవన్‌లో టీడీపీపీ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్రం ఇచ్చేట్టు కనిపించడంలేదన్నారు. ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ నిధులు ఇచ్చేందుకు కేంద్రం ముందుకు వస్తుందోని.. అయినా ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గేది లేదని చంద్రబాబు తెలిపారు. ప్రత్యేక హోదా వల్ల పారిశ్రామిక ప్రగతి వేగవంతం అవుతుందని తద్వారా ఉపాధి హామీ జరుగుతుందని, వేల ఉద్యోగాలు వస్తాయని అందరూ భావించినప్పటికీ ఎన్నికలలో ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ఇచ్చిన హామీ చరిత్రలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి ఏపికి ప్రత్యేక హోదా కల్పిస్తామన్న కేంద్ర ప్రభుత్వ హామీ  గాలిలో కలిసి పోయింది. అయితే ఏపికి ప్రత్యేక హోదా కల్పించడం వల్ల కలిగే ఏపికి కలిగే ప్రయోజనాలకు గండిపడే అవకాశం క్లీయర్ గా కనిపిస్తోంది.

ప్రత్యేక హోదా కల్పించడం వల్ల రాష్ట్రానికి అధిక నిధులతో పాటు, ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నుండి వసూలు చేసే పన్నుల నుండి మినహాయింపు ఉంటుంది. పరిశ్రమలకు కూడా పన్నుల నుండి మినహాయింపు లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం విధించే దాదాపు 14 రకాల పన్నుల నుండి ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రానికి మినహాయింపు లభిస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టే బడ్జెట్ లో ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ప్రత్యేకంగా నిధులు ఇస్తారు. ఇలా రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్దిపథాన దూసుకెల్లడానికి ఉపయోగపడుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఇప్పుడు ఏపి రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగిస్తుందనే చెప్పాలి. మరి చంద్రబాబు నాయుడు మరోసారి కేంద్రంపై వత్తిడి తెచ్చి ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీ చేత ప్రకటన చేయిస్తారా లేదా ఎక్కువ నిధులను ఆశించి ఊరుకుంటారా తేలాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles