woman cheats people on the name of comission

Hyderabad woman cheats people

hyderabad woman cheats people, woman cheats hyderabadis, woman cheats people on the name of comission surekha, srinivasa rao, love marriage,

woman who was fond of becoming heroine, cheats people on the name of commissions

సినిమా తెచ్చిన తంటా.. రూ. 10 కోట్లకు ముంచిన జంట

Posted: 04/22/2015 10:22 PM IST
Hyderabad woman cheats people

సినిమా హీరోయిన్‌గా వెండి తెరపై వెలిగిపోవాలని కలలు కంటూ నగరానికి వచ్చిన ఆ యువతి.. అవకాశాల కోసం అక్కడా.. ఇక్కడా వెతికి అలసిపోయింది. ఎంతకీ హీరోయిన్ అవకాశాలు తన దరికి రాకపోవడంతో.. సినీ ప్రపంచంలోనే మనగలగాలని  నిశ్చయించుకుని.. తానే ఓ సినిమా నిర్మించి, అందులో హీరోయిన్‌గా నటించాలనుకుంది. అయితే సినిమా తీయాలంటే డబ్బు అవసరం అని తెలుసుకున్న యువతి.. ప్రణాళికా బద్దంగా అడుగులు ముందుకేసి.. ఇప్పడు పోలీసుల కంట పడకుండా.. అడ్రస్ లేకుండా తప్పించుకుని తిరుగుతూ.. అదృశ్యమైంది. సినీ పరిశ్రమకు వచ్చి అవకాశాల కోసం చిన్న చిన్న పాత్రలు వేస్తూ.. ఆ తరువాత అవకాశం కలసి వచ్చి హీరోయిన్ అయిన వారు చాలా మంది వున్నారని తెలిసి కూడా.. ఏకంగా హీరోయిన్ అవకాశమే కావాలన్న ఆశతో జనాలను నిండా ముంచేసి.. జెండా ఎత్తేసింది.

ఈ క్రమంలో శ్రీనివాస రావు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి.. అది ప్రేమగా మారడంతో.. అతడిని పెళ్లి చేసుకుని మరీ జనాలను బూరడీ కోట్టించింది. ఇద్దరూ కలిసి ‘కమీషన్ల’ దందా మొదలెట్టారు. తమ వద్ద పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం కమీషన్ ఇస్తామని అమాయకులకు ఆశ చూపించి సుమారు రూ. 10 కోట్లు వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు వీరిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఇప్పటికే పోలీసులు భర్త శ్రీనివాస్‌రావును అరెస్టు చేయగా, భార్య సురేఖ పరారీలో ఉంది. కాగా, వీరి చేతిలో మోసపోయిన వారి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. అన్ని లెక్కలూ తేలే సమయానికి ఎన్ని కోట్లకు చేరుకుంటుందో మరి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : woman  heroine  cinema  fraud  

Other Articles