Narachandrababu | Mahabubnagar | Tour | Revanth Reddy

Narachandrababu naidu tour tommarrow in mahabubnagar dist

narachandrababu, chandrababu, tour, mahabubnagar, TTDP, TRS, manchireddy kishan reddy

Narachandrababu naidu tour tommarrow in mahabubnagar dist. TTDP leaders arranging all facilities to the chandrababu tour. Revanth Reddy will suprevising the tour in mahabubnagar.

రేపు పాలమూరుకు చంద్రబాబు.. టిఆర్ఎస్ నుండి షాక్

Posted: 04/22/2015 08:58 AM IST
Narachandrababu naidu tour tommarrow in mahabubnagar dist

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ పర్యటన ఖరారైంది. రేపు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో టిడిపి అధినేత పర్యటించనున్నారు. అయితే చంద్రబాబు పర్యటన సందర్భంగా టిటిడిపి నేతలు పర్యటనపై సమీక్ష నిర్వహించారు.  తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు నివాసంలో భేటీ అయ్యారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావుతో పాటు ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, జి.సాయన్న, గోపీనాథ్, వివేకానంద, కృష్ణారావు, ప్రకాశ్‌గౌడ్ హాజరయ్యారు. సభ నిర్వహణను రేవంత్‌రెడ్డికి అప్పగించారు. చంద్రబాబు కాన్వాయ్‌ మార్గంలో ఏర్పాట్లను రంగారెడ్డి ఎమ్మెల్యేలకు అప్పగించారు.

అయితే తెలంగాణలో పర్యటించనున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు టీఆర్ఎస్ గట్టి షాక్ ఇవ్వనుంది. రంగారెడ్డి జిల్లా  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి త్వరలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు రెండు రోజులుగా బాగా ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు పాలమూరు జిల్లాలో పర్యటించే రోజునే కిషన్ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకోవాలని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి టిటిడిపికి జీవం పొయ్యాలని చంద్రబాబు, పర్యటన సమయంలోనే టిడిపి నాయకులను టిఆర్ఎస్ లోకి చేర్చుకోవాలని గుళాబీ నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎవరి ప్రయత్నాలు వారివి.. మొత్తానికి ఏ పార్టీకి లాభం చేకూరుతుందో..

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narachandrababu  chandrababu  tour  mahabubnagar  TTDP  TRS  manchireddy kishan reddy  

Other Articles