Narachandrababu | Ap olympic association | President.

Narachandrababu decision on ap olympic association president

Narachandrababu, chandrababu, ap olympic association, cm ramesh, galla jayadev

Narachandrababu decision on ap olympic association president. Chandrababu convece cm ramesh and galla jayadev to aware from ap olympic association politics. May chandrababu give chance to new person as ap olympic association president.

చంద్రబాబు చాణిక్యం.. జయదేవ్, రమేష్ ఔట్.. కొత్త వారు ఇన్..?

Posted: 04/22/2015 08:10 AM IST
Narachandrababu decision on ap olympic association president

ఆంధ్రప్రదేశ్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్ష పదవి వివాదానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తెరదించారు. సిట్టింగ్‌ ఎంపీలు ఒలింపిక్‌ అధ్యక్ష పదవిని చేపట్టరాదని, ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. చంద్రబాబు సూచనతో ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్ష పదవికి సంబంధించిన వివాదం సద్దుమణిగినట్లైంది. ఢిల్లిdలో మంగళవారం సాయంత్రం జరిగిన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఎంపీల సమావేశానికి చంద్రబాబు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఎలింపిక్‌ అసోసియేషన్‌ వ్యవహారం కూడా ప్రస్తావనకు వచ్చంది. ఒకే పార్టీకి చెందిన ఎంపీలు అధ్యక్ష పదవికోసం పోరాడడం మంచి సంప్రదాయం కాదని, హైకోర్టును ఆశ్రయించి ఈ వ్యవహారాన్ని మరింత జఠిలం చేయడం మానుకోవాలని చంద్రబాబు కోరారు.

ఒలింపిక్‌ సంఘానికి తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు అధ్యక్ష స్థానం కోసం పోటీ పడడం లేదని ఈ పదవిని వారు వదిలి వేస్తున్నారని  కేంద్ర మంత్రి సత్యనారాయణ చౌదరి చెప్పారు. కొత్త రాష్ట్రంలో పరిష్కరించవలసిన సమస్యలు ఎన్నో ఉన్నాయని ఆ సమస్యలను పూర్తి చేసేందుకు ఎంపీలంతా దృష్టి సారించాలని చంద్రబాబు కోరిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అసోసియేషన్‌ అధ్యక్ష పదవి నుంచి గల్లా జయదేవ్‌, సీఎం రమేష్‌లు తప్పుకుంటుంన్నారని ఇందుకు ఈ ఇద్దరు ఎంపీలు అంగీకారం కూడా తెలిపారని ఆయన చెప్పారు. ఈ పదవికోసం పోటీ పడుతున్న ఎంపీలు గల్లా జయదేవ్‌, సీఎం రమేష్‌లను తప్పుకోవలసిందిగా చంద్రబాబు ఆదేశించినట్టు ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ఇద్దరు ఎంపీలతో చంద్రబాబు దాదాపు అరగంటకు పైగా చర్చించారు. సిట్టింగ్‌ ఎంపీలు ఈ పదవిని ఆశించవద్దంటూ స్పష్టం చేశారు. ఈ ఇద్దరి బదులు వేరే వ్యక్తిని నియమిస్తామని ఆయన తేల్చి చెప్పారు. చంద్రబాబు నిర్ణయంతో సంతృప్తి వ్యక్తం చేసిన జయదేవ్‌, రమేష్‌లు ఒకే కారులో వెళ్ళిపోవడం గమనార్హం. అసోసియేషన్‌ అధ్యక్షుని ఎంపిక బాధ్యత చంద్రబాబును తీసుకోవలసిందిగా ఎంపీలు కోరారు. దీనిపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తానని ఆయన చెప్పారు

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narachandrababu  chandrababu  ap olympic association  cm ramesh  galla jayadev  

Other Articles