Court | Gallajayadev | CM Ramesh | ap olympics

Court support the elected galla jayadev as ap olympic association president

court order, galla jayadev, cm ramesh, ap olympic association president, elections, ap, telangana

Court support the elected galla jayadev as ap olympic association president. Between the cm ramesh and galla jayadev, ap olympic association presidential elections.

కోర్టుకు చేరిన ఒలంపిక్ అసోసియేషన్ వివాదం.. గల్లా జయదేవ్ కు ఊరట

Posted: 04/21/2015 01:15 PM IST
Court support the elected galla jayadev as ap olympic association president

ఆంధ్రప్రదేశ్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఎన్నికలు వివాదాస్పదంగా మారాయి. ఈ వివాదం ఏకంగా కోర్టు మెట్లు కూడా ఎక్కేసింది.  అధ్యక్షుడుగా గల్లా జయదేవ్‌ ఎన్నికయినట్లు ఇప్పటికే ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ కూడా గుర్తింపు ఇచ్చినట్లు ఆయన ప్రకటించుకున్నారు. ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికకు  సంబంధించి నెలకొన్న వివాదంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు స్వల్ప ఊరట లభించింది. ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ కు రెండుసార్లు ఎన్నికలు జరగడంతో ఆ వివాదం హైకోర్టుకు చేరింది. అంతకముందు ఏప్రిల్ 19వ తేదీనే జరిగిన ఎన్నికే  సరైనదంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పుపై  హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు సరైన ఎన్నిక ఎవరిదో తేల్చాలంటూ సింగిల్ బెంచ్ జడ్జికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికపై వివాదాన్ని జూన్ మొదటి వారంలో హైకోర్టు విచారించే అవకాశం ఉంది.
 
ఏపీ అసోసియేషన్ కు రెండు సార్లు ఎన్నికలు  జరిగిన సంగతి తెలిసిందే. తొలి ఎన్నికలో  ఏపీ ఒలింపిక్ అసోసియన్ అధ్యక్షుడిగా గల్లా జయదేవ్ ఎన్నికైనట్లు తెలపగా, తరువాత జరిగిన ఎన్నికలో సీఎం రమేష్ అధ్యక్షుడిగా నియమితులైనట్లు ప్రకటించారు. దీంతో ఆ ఎన్నికపై వివాదం నెలకొంది. ఆదివారం నాడు గుంటూరులో కార్యవర్గ సమావేశం కూడా నిర్వహించారు. పలు క్రీడా సంఘాల ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గల్లా జయదేవ్, సిఎం రమేష్ వర్గీయులు తమ నాయకులే అధ్యక్షుడు అంటూ మాటల యుద్దానికి దిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : court order  galla jayadev  cm ramesh  ap olympic association president  elections  ap  telangana  

Other Articles