Salman khan | Hit and run case | Court | Judgement

Salman khan hit and run case judjement will be announced on may 6

salman khan , hit and run case, court, actors, producers,

A sessions court will pronounce the judgment in the 2002 alleged hit and run case involving actor Salman Khan on may 6 Judge D W Deshpande announced the date before a packed court room today.

సల్మాన్ ఖాన్ సంగతి అప్పుడే తేలుతుంది

Posted: 04/21/2015 01:14 PM IST
Salman khan hit and run case judjement will be announced on may 6

సినిమా సినిమాకు నటనలో అదగొడుతూ.. బాలీవుడ్ సినిమా రికార్డులను షేక్ చేసిన సల్మాన్ ఖాన్ కు గత కొంత కాలంగా కొర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. 2002లో హిట్ అండ్ రన్ కేసు కీలక మలుపుల తిరుగుతూ చివరకు వచ్చే నెల 6కి వాయిదా పడింది. అయితే వాయిదా మాటేమో కానీ సల్మాన్ ను నమ్ముకొని సినిమాలు తీస్తున్న నిర్మాతలు మాత్రం లబోదిబోమంటున్నారు. అదేంటి సల్మాన్ ఖాన్ గురించి తీర్పుకు వాళ్లకు ఏంటి సంబందం అని అనుకుంటున్నారా.. సల్మాన్ ఖాన్ ను నమ్మి దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్ ను పెట్టారు నిర్మాతలు మరి... ఆ మాత్రం భయం ఉండదా ఏంటి. ఒకవేళ సల్మాన్ ఖాన్ కేసులో దోషిగా తేలితే పది సంవత్సరాలు జైలు శిక్షపడే అవకాశం ఉంది. మరి నమ్ముకున్న సల్మాన్ జైల్ లో కూర్చుంటే నిర్మాతలకు భారీ నష్టమే కదా.

2002 సెప్టెంబర్ 28న అర్ధరాత్రి ముంబైలో ఓ హోటల్ నుంచి సల్మాన్ కారులో వస్తుండగా రోడ్డుపై నిద్రిస్తున్నవారిపైకి ఆ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా నలుగురు గాయపడ్డారు. కేసును విచారణకు స్వీకరించిన స్థానిక కోర్టు.. ఇప్పటివరకు 25 మంది నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసింది. చివరిగా సల్మాన్‌ఖాన్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. సల్మాన్ ఖాన్ కారు డ్రైవర్ విచారణ సందర్భంగా కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చాడు.‘ముంబైలో అర్థరాత్రి ప్రమాదం జరిగిన సమయంలో కారును తానే నడుపుతున్నానని, సల్మాన్ నడపలేదని స్పష్టం చేసాడు. ఈ కేసుకు సంబంధించిన సల్మాన్ ఖాన్ డ్రైవర్ కోర్టుకు హాజరు కావడం ఇదే తొలిసారి. ఇది డమ్మీ సాక్ష్యం అని పబ్లిస్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ వాదించారు. ప్రధాన నిందితుడిగా ఉన్న సల్మాన్‌ఖాన్ ఇంతకు ముందు ఎప్పుడూ డ్రైవర్ అశోక్‌సింగ్ పేరును ప్రస్తావించలేదని అన్నారు. క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగానూ జరిగిన వాదనలను పిపి కోర్టు దృష్టికి తెచ్చారు. మరి వాదనలు విన్న కోర్టు ఈ కేసులో ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మే 6వ తేదీన వచ్చే తీర్పు కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి సల్మాన్ భాయ్ ని నమ్ముకున్నోళ్లు మునిగి పోతారో లేదా బ్రతికి పోతారో మే6న తేలుతుంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : salman khan  hit and run case  court  actors  producers  

Other Articles