Facebook | Whatsapp | Briyan cotan | John chom

Facebook rejected a persons application for job in its company

facebook, whatsapp, messenger, briyan octan, john chom,

Facebook rejected a persons application for job in its company. But after some time he made whatsapp app and competetion to facebook.

ఫేస్ 'బుక్' అయ్యింది తెలుసా..!?

Posted: 04/21/2015 12:00 PM IST
Facebook rejected a persons application for job in its company

ఉద్యోగం కోసం ఫేస్ బుక్ ఆఫీస్ చుట్టూ తిరిగిన ఓ వ్యక్తి కోసం పేస్ బుక్ ఆఫీస్ స్టాఫ్ చక్కర్లు కొట్టింది. గతంలో ఉద్యోగానికి కూడా పనికి రాడు అని అనుకున్న వ్యక్తి అద్భుతాలను చేసి చూపించారు. ఫేస్ బుక్ సంస్థ ను దాదాపు కాళ్ల బేరానికి తెచ్చిన అతడి ప్రాడక్ట్ ఏంటో తెలుసా..? ఇప్పుడు అందరినీ ఊపేస్తున్న వాట్సాప్. అవును నిజం వాట్సాపే.. అసలు ఫేస్ బుక్ ఎలా వాట్సప్ కు బుక్ అయిందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే..

బ్రియాన్ ఆక్టన్.. ఇతడు 2000లో డాట్ కామ్ బబుల్ లో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ట్విట్టర్, ఫేస్ బుక్ కంపెనీల్లో ఉద్యోగం కోసం అప్లై చేసుకుంటే రిజెక్ట్ చేశారు. తర్వాత తన మిత్రుడు జాన్-కోమ్, ఆక్టన్ లకు యాహూలో ఉద్యోగాలు దొరికాయి. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్సయ్యారు. ఇద్దరు తెలివైన వాళ్లు.. 2007లో యాహూ ఉద్యోగాన్ని వదిలేశారు. కొత్త భవిష్యత్ కు బాటలు వేశారు. 2009లో ఇద్దరూ కలిసి ఒక మెసేజింగ్ సర్వీస్ ప్రారంభించారు. అదే.. వాట్సప్.

వాట్సప్ క్రమంగా పుంజుకుంది. 50 మంది ఉద్యోగులతో నడుస్తూ.. ఆరేళ్ల అత్యంత ప్రజాదరణ పొందింది. . ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మొబైల్ ఫోన్స్ లో వాట్సప్ ఉంది. 2014లో దీనిని ఫేస్ బుక్ 19 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ మొత్తం దాదాపు లక్షా 18 వేల కోట్ల రూపాయలకు సమానం. బ్రియాన్ ఆక్టన్ ను గనుక ఫేస్ బుక్.. ఆనాడు ఉద్యోగంలోకి తీసుకుని ఉంటే బహుశా అదే కంపెనీలో ఉండే వాడేమో. ఆ కంపెనీలోనే వాట్సప్ లాంటి మెసేజింగ్ సర్వీస్ ను సృష్టించేవాడేమో... ఇప్పుడు తనకు తనకు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించిన సంస్థకే..వాట్సప్- కోసం లక్ష కోట్ల రూపాయలు అందుకున్నాడు. మార్కెట్ లో నిలవాలంటే.. ఈ వాట్సప్ – ను కొనక తప్పని పరిస్థితి ఫేస్ బుక్-కు వచ్చింది. వాట్సప్ ను కొనుగోలు చేయకపోతే తాను కూడా ఆర్కుట్ లాగా కాలగర్భంలో కలిసి పోవాల్సి రావొచ్చని ఫేస్ బుక్ భయపడింది. మరి దీన్నే కాలం చేసిన మాయ అని అంటారేమో. ఒకప్పుడు కాదనుకున్న వ్యక్తి దగ్గరికే కాళ్ల బేరానికి దిగింది ఫేస్ బుక్.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : facebook  whatsapp  messenger  briyan octan  john chom  

Other Articles