Girirajsingh | Soniagandhi | Congress | Racial | Paliament

Bjp mp giriraja comments on congress president sonia gandhi getting clash between the govt and opposition

GIrirajsingh, sonia gandhi, paliament, loksabha, bjp, congress, clash

BJP mp Giriraja comments on congress president sonia gandhi getting clash between the govt and opposition. The Bjp mp giriraja comments on sonia gandhi like racial comments in the past.

గిరిరాజ్ వివాదం.. లోక్ సభలో దుమారం

Posted: 04/20/2015 02:06 PM IST
Bjp mp giriraja comments on congress president sonia gandhi getting clash between the govt and opposition

ఎర్రతోలు వల్లే సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయ్యారని గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు లోక్ సభణు ఊపేశాయి. లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ క్షమాపణలు చెప్పాలంటూ జ్యోతిరాధిత్యసింధియా డిమాండ్‌ చేశారు. సోమవారం ఉదయం సభ మొదలవగానే ఈ అంశంపై చర్చ జరపాలంటూ కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తిరస్కరించారు.
 
దీంతో దీనిపై చర్చజరపాలంటూ కాంగ్రెస్‌ సభ్యులు నిరసనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. కేంద్రమంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ జ్యోతిరాధిత్య ఆరోపించారు. మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేసిన గిరిరాజ్‌సింగ్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. గందరగోళం మధ్య సభను స్పీకర్‌ కొద్దిసేపు వాయిదా వేశారు. చివరకు సోనియాపై చేసిన వ్యాఖ్యల పట్ల కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ క్షమాపణలు చెప్పారు. నా మాటలు ఎవరినైనా బాధపెడితే క్షమించండి అని ఆయన అన్నారు. మొత్తానికి గిరిరాజ్ క్షమాపణలు చెప్పడంతో సభలో గందరగోళం సద్దమణిగింది.

**అభినవచారి**

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GIrirajsingh  sonia gandhi  paliament  loksabha  bjp  congress  clash  

Other Articles