Redsandal | Smuggling | Tamilnadu | AP | Taskforce

Taskforce getting the details of political leaders who involved in red sandal smuggling

Task force, Red sandal, smuggling, ap, tamilnadu, calldata, shashachalam

Taskforce getting the details of Political leaders who involved in red sandal smuggling. Ap task force got call data of smugglers, who transporting red sandal from sheshachalam forest.

ఎర్రచందనంలో.. రాజకీయ రంగులు

Posted: 04/20/2015 09:49 AM IST
Taskforce getting the details of political leaders who involved in red sandal smuggling

ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో సంచలనం రేపిన ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్ కౌంటర్ లో కీలక సమాచారం వెలుగులోకి వస్తోంది. శేషాచలం అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లో మరణించిన 20 మంది ఎర్ర దొంగల సెల్‌ఫోన్‌ కాల్‌డేటాను పరిశీలిస్తే ఎన్నో వాస్తవాలు బయటకు వచ్చినట్లు తెలిసింది. సెల్‌ఫోన్ల కాల్‌ డేటాను కదిలిస్తే ఎర్ర చందనం స్మగ్లింగ్‌ డొంక మొత్తం కదిలింది. ఈ స్మగ్లింగ్‌ వెనక ఏపీ, తమిళనాడులకు చెందిన మాజీ మంత్రుల హస్తం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈనెల ఏడో తేదీన జరిగిన ఎన్‌కౌంటర్‌ తర్వాత 20 మంది ఎర్ర దొంగల సెల్‌ ఫోన్లను పోలీసులు సీజ్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ సెల్‌ఫోన్ల కాల్‌డేటా ఆధారంగా బడా స్మగ్ల్లర్లు, స్మగ్లింగ్‌ వెనక ఉన్న పెద్ద నాయకుల పేర్లు బయటకు తీస్తామని అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రకటించారు. . ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారు శేషాచలం అడవుల్లోకి రాకముందు.. వచ్చిన తర్వాత ఎవరెవరితో మాట్లాడారు? వారు ఏ ప్రాంతానికి చెందినవారు? వారికి డైరెక్షన్‌ ఇచ్చి అడవిలోకి పంపిన వ్యక్తులెవరు? అనే కోణాల్లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆరా తీశారు. వారి సెల్‌ఫోన్‌ కాల్‌ డేటాలను పరిశీలించారు. దాదాపు 12 రోజులుగా ప్రత్యేక బృందాలు వీటిపైనే ప్రత్యేకంగా దృష్టిసారించాయి. వాటి ఆధారంగా తమిళనాడుకు చెందిన 16 మంది సూత్రధారులను రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిని తిరుపతికి తీసుకొచ్చినట్లు తెలిసింది. ఈ స్మగ్లింగ్‌ వెనక ప్రధానంగా తమిళనాడు, ఏపీకి చెందిన ఇద్దరు మాజీ మంత్రులు, చెన్నైలోని రెడ్‌హిల్స్‌ కేంద్రంగా ఉన్న డీఎంకేలోని ఇద్దరు కీలక నేతలు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, డీఎంకేకు చెందిన ఓ కార్పొరేటర్‌ హస్తం ఉన్నట్లు విచారణలో బయటపడినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
 
చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి చెందిన ఓ మాజీ జడ్పీటీసీ, వైసీపీకి చెందిన ఓ సర్పంచి, కాంగ్రెస్‌ హయాంలో ఓ వెలుగు వెలిగిన.. తిరుపతి, పీలేరు, ఎర్రావారిపాళెం ప్రాంతంలో ఉన్న ఓ ఛోటా ప్రజా ప్రతినిధి పాత్రధారులుగా వ్యవహరించినట్లు తెలిసింది. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగానే పశ్చిమ బెంగాల్‌లోని చిలుగురి ప్రాంతానికి 171 కిలోమీటర్ల దూరంలోని ఓ గోడౌన్‌పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆదివారం దాడులు చేశారు. అక్కడ 11 టన్నుల అత్యంత విలువైన, అరుదైన ‘ఏ’ గ్రేడ్‌ ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.22 కోట్లు ఉంటుందని సమాచారం. అక్కడే తమిళనాడుకు చెందిన బడా స్మగ్లర్‌ సౌందర్‌రాజన్‌ను కూడా అరెస్టు చేశారు. ఈ గోడౌన్‌ తమిళనాడుకు చెందిన మాజీ మంత్రిదిగా పోలీసులకు తెలిసింది. మొత్తం ఎర్ర చందనం దుంగలను రోడ్డు మార్గంలో నేపాల్‌, బర్మా మీదుగా చైనాకు తరలించేందుకు స్మగ్లర్లు సిద్ధమయ్యారన్న పోలీసులు ఈ దాడులు చేశారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్‌ నుంచి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆదివారం రాత్రి ఏపీలోని పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. తమిళనాడుకు చెందిన మాజీ మంత్రి గోడౌన్‌లోనే సరుకు లభ్యమైందని, మరింత సరుకు దొరికే అవకాశం కూడా ఉందని చెప్పినట్లు తెలిసింది. అక్కడ లభించిన 11 టన్నుల ఎర్ర చందనాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు సిద్ధమయ్యారు. కాగా, ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్‌ అదుపులో ఉన్న 16 మంది తమిళ స్మగ్లర్లు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మిగిలిన వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలున్నాయి. తీగ లాగితే డొంక కదిలిన వైనంగా కాల్ డేటాతో ఎర్రచందనం స్మగ్లింగ్ రాకెట్ ను బట్టబయలు చేస్తున్నారు టాస్క్ ఫొర్స్ పోలీసులు. మరి ఎర్ర చందనం స్మగ్లింగ్ లో ఇంకెన్ని నిజాలు వెలుగులోకి వస్తాయో ఎంత మంది రాజకీయ నాయకుల చీకటి కోణాలు బయటపడతాయో చూడాలి.

**అభినవచారి**

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Task force  Red sandal  smuggling  ap  tamilnadu  calldata  shashachalam  

Other Articles