TTDPLP | Revanth reddy | KCR | Telanagana | Soda

Ttdplp leader revanth reddy contraversial comments on telanagana cm kcr

kcr, revanthreddy, alchohol, soda, positions, tdp, ttdp,

TTdplp leader revanth reddy contraversial comments on telanagana cm kcr. He said that kcr alloted positions for those who mix soda in alchohol for kcr.

సోడా పోసినోళ్లకే పదవులు: రేవంత్ రెడ్డి

Posted: 04/20/2015 08:34 AM IST
Ttdplp leader revanth reddy contraversial comments on telanagana cm kcr

టిటిడిఎల్పీ నేత రేవంత్ రెడ్డి మాట్లాడారు అంటే తూటాలా పేలాల్సింది. ఆయన మాటలు అలాంటివి మరి. తెలంగాణ ప్రభుత్వంపై మరీ ముఖ్యంగా టిఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సిఎం కెసిఆర్ పై చేసే వ్యాఖ్యల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా మరోసారి తెలంగాణ సిఎం కెసిఆర్ పై మాటల తూటాలు పేల్చారు రేవంత్ రెడ్డి. మందులో సోడా వేసినోళ్లకే పదవులు ఇచ్చారని టీడీఎల్పీ ఉపనేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆంధ్రోళ్ల కమీషన్లకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దాసోహమయ్యారని వ్యాఖ్యానించారు. ఓడిపోయినా.. టీడీపీలో మొనగాళ్లు ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో 950 మంది రైతులు చనిపోతే సీఎంకు కనీసం పరామర్శించేందుకు వీలుకాలేదా? అని ప్రశ్నించారు. 1200 మంది తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకుంటే కేవలం 480 మందినే గుర్తించడమేమిటని అడిగారు.

గతంలోనూ కెసిఆర్ పై ఇలాంటి వవాదాస్పద వ్యాఖ్యలే చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఎత్తిపోతల పథకాలు ఎలా ఉన్నా.. కెసిఆర్ ఫాం హౌజ్ లో మాత్రం ఎత్తిపోతలు బాగా జరుగుతున్నాయని విమర్శించారు. పేదలకు ఒకే ఇంట్లో రెండు పింఛన్లు ఇవ్వలేవా? అని నిలదీశారు. సమగ్రకుటుంబ సర్వేలో పశువులు, పందులు, కోళ్ల వివరాలు అడిగిన సీఎం.. పేదలకు ఏం చేశారని ప్రశ్నించారు. మహిళలకు ఒక్కరి కూడా మంత్రి పదవిని ఇవ్వలేకపోయారని, బతుకమ్మ పండగకు మహిళలు తప్పకుండా నిలదీస్తారని పేర్కొన్నారు. మొత్తానికి కెసిఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడంలో రేవంత్ రెడ్డి ముందుంటారని మరోసారి నిరూపించారు.

**అభినవచారి**

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  revanthreddy  alchohol  soda  positions  tdp  ttdp  

Other Articles