'This is a Government for the Poor,' PM Modi Tells BJP Lawmakers

Narendra modi projects his govt as pro poor pro farmer

Narendra Modi projects his govt as pro-poor, pro-farmer, This Government is for Poor,' PM Modi Tells BJP Lawmakers, pro-corporate government, Prime Minister Narendra Modi, modi government pro-poor and pro-farmers, strong opposition, Narendra Modi, BJP, NDA, Poor, farmer, Congress, Land Bill, BJP law makers

Accused of being pro-corporate, Prime Minister Narendra Modi on Sunday projected his government as pro-poor and pro-farmers and lashed out at his critics for their "congenital habit" of running down BJP.

పేదలకు, రైతులకు భరోసా ఇచ్చేది మన ప్రభుత్వం..

Posted: 04/19/2015 03:38 PM IST
Narendra modi projects his govt as pro poor pro farmer

అంతరిక్షం, అణుశక్తి రంగాల్లో మనదైన ముద్ర వేశామని, పార్లమెంట్‌లో బలమైన శక్తిగా ఉంటే బాగుంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలో బీజేపీ ఎంపీల వర్క్‌షాపును ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సంక్షేమ పథకాలపై ఎంపీలకు వివరించారు. మనపై ప్రజలకు నమ్మకం ఉందని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు. యెమెన్‌లో చిక్కుకున్న భారతీయులను సమర్థవంతంగా కాపాడుకోగలిగామని, మంత్రి వికె సింగ్‌ సమర్థవంతంగా పనిచేశారని ఆయన ప్రశంసించారు.

విధేశీ పర్యటనలో భాగంగా పలు దేశాలతో ఒప్పందాలు కుదిరాయని ప్రధాని మోదీ తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎంపీలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవాలని ఆయన సూచించారు. కేనడాతో యూరేనియం ఒప్పందం చారిత్రకమని, దీనిపై ప్రశంసలు అందుతున్నాయని ఆయన అన్నారు. భారత్‌లో పెట్టుబడులకు వివిధ దేశాలు ఆసక్తి చూపుతున్నాయని ఆయన చెప్పారు. పేదలను ధనికులుగా మార్చడమే మా లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు. భారత్‌లో బలమైన ప్రతిపక్షముంటేనే బాగుంటుందని మోదీ అభిప్రాయపడ్డారు. పేదల సంక్షేమానికి ఎన్డీయే కట్టుబడి ఉందని ఆయన అన్నారు. మీడియాలో వస్తున్న వ్యతిరేక వార్తలను పట్టించుకోవద్దని ఆయన అన్నారు. అవినీతిరహిత భారత్‌ను నిర్మిద్దాని మోదీ పిలుపునిచ్చారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  BJP  NDA  Poor  farmer  Congress  Land Bill  

Other Articles