sitaram yechury unanimously elected as new cpm national general secretary

Sitaram yechury is new cpm general secretary

CPI(M) politburo member Sitaram Yechury, Sitaram Yechury is new CPM general secretary, Sitaram Yechury, CPI(M), Prakash Karat, S Ramachandran Pillai, new cpm national general secretary, sitaram yechury unanimously elected, yechury new cpm national general secretary

;CPI(M) politburo member Sitaram Yechury on Sunday was elected as the new General Secretary of the party, succeeding Prakash Karat.

సీపీఐ(ఎం) పార్టీ జాతీయ సారధిగా సీతారం ఏచూరీ

Posted: 04/19/2015 03:01 PM IST
Sitaram yechury is new cpm general secretary

సీపీఎం జాతీయ పార్టీ నూతన సారధిగా సీతార ఏచూరీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు పోటీలో ఉన్న రామచంద్రన్ పిళ్లై తన నామినేషన్ ఉపసంహరించు కుంటున్నట్లు ఆదివారం విశాఖపట్నంలో ప్రకటించారు. దీంతో సీతారాం ఏచూరి ఎన్నిక ఏకగ్రీవమైంది. విశాఖపట్నం వేదికగా సీపీఎం 21వ మహాసభలు ఈ నెల 14న ప్రారంభమైనాయి. ఆదివారం ఆ సమావేశాలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిని ఈ సమావేశాల్లోనే ఎన్నిక చేయవలసి ఉంది. ఈ పదవికి సీతారాం ఏచూరి, రామచంద్రన్ పిళ్లై పోటీలో నిలిచారు.

అయితే పార్టీకి నూతన సారథిగా సీతారాం ఏచూరిని ఎంపిక చేయాలని పార్టీ నేతలంతా ఓ నిర్ణయానికి వచ్చారు. దీంతో రామచంద్రన్ పిళ్లై తన నామినేషన్ ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. దీంతో పార్టీ పగ్గాలు అందుకునేందుకు సీతారాం ఏచూరి ఎన్నిక లాంఛనప్రాయమైంది. సీతారాం ఏచూరి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనట్లు ప్రకాశ్ కారత్ ప్రకటించారు. అలాగే 16 మందితో సీపీఎం పోలిట్ బ్యూరోను ఎంపిక చేశారు. పొలిట్ బ్యూరో సభ్యులుగా సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్,  రామచంద్రన్ పిళ్లై, బిమన్ బసు, మాణిక్ సర్కార్, విజయన్, బి వి రాఘవులు, బాలకృష్ణన్, ఎంఏ బేబి, సూర్యకాంత్ మిశ్రా, పద్మనాభన్, బృందాకారత్,  మహ్మద్ సలీమ్, సుభాషిణి అలీ, హన్నర్ మొల్లా, జి.రామకృష్ణన్ ఎన్నికయ్యారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sitaram yechury  cpm leader  cpm national general secretary  

Other Articles