Father and daughter show off world's widest tongues

Father of three breaks guinness world record for the worlds widest tongue

Byron Schlenker’s tongue 8.6 cm, Emily tongue 7.3 cm., Gobfather, Guinness Book of World Records, Australian man with the world's widest tongue, tongue, widest tongue, Guiness World Record, world record

This father and daughter duo hold the Guinness World Records for the world’s widest male and female tongues, Syracuse, New York, USA.

ప్రపంచ రికార్డులకు ఎక్కిన అత్యంత వెడల్పు జిహ్వలు

Posted: 04/18/2015 08:05 PM IST
Father of three breaks guinness world record for the worlds widest tongue

వీళ్లిద్దరేంటి ఇలా నాలుక బయటపెట్టి ఫొటోకు పోజిస్తున్నారనుకుంటున్నారా.? విషయం వుంది.. ఆ నాలుకతోనే వాళ్లను సెలబ్రిటీలుగా మార్చాయి. అదెలాగంటారా..?. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉండే ఈ తండ్రీ కూతుళ్లకు ప్రపంచంలో అత్యంత వెడల్పయిన నాలుకలు కలిగి వున్నారు. దీంతోనే వాళ్లు ప్రపంచ రికార్డులకు ఎక్కారు. నిజమండీ వీరికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కింది. బైరన్ ష్లీన్‌కర్ అనే 47 ఏళ్ల ఈ పెద్దాయన 8.6 సెంటీమీటర్ల వెడల్పు నాలుకతో పురుషుల విభాగంలో గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు.

అయితే తండ్రి తాను ఏ మాత్రం తీసిపోను అంటూ పోటీ పడిన ఆయన 14 ఏళ్ల కూతురు ఎమిలీ కూడా 7.3 సెం.మీ వెడల్పు నాలుకతో మహిళల విభాగంలో గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించింది. దీంతో ఇప్పుడు ప్లీన్ కర్ ను అందరూ గాబ్ ఫాధర్ ( గెన్నీస్ బుక్ తండ్రి) అని ముద్దుగా పిలుస్తున్నారు. దానికి ఆయన చాలా సంతోషిస్తున్నాడు. తన కూతురు పాఠశాల ప్రాజెక్టు వర్క్ లో సాయం అందించే పనిలో భాగంగా గతంలో ఆయన ఓ నిజం తెలుసుకున్నాడు. ప్రపంచంలో అత్యంత వెడల్పపాటి నాలుకతో ఒక అస్ట్రేలియా దేశస్తుడు ప్రపంచ రికార్డులకు ఎక్కడని తెలుసుకున్న ఆయన.. దానిని క్షుణ్ణంగా పరిశీలించి.. తన నాలుకను కొలుచుకోవాలని బావించాడు. అంతే అనుకోకుండా ఆయన నాలుక అంతకన్నా వెడల్పుగా వుంది. దీంతో తన పేరిట ప్రపంచ రికార్డును నమోదు చేసుకున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Guinness record  Tongue  Biran sleenkar  

Other Articles