AP | Capital | Sand | Chandrababu

Ap state govt move to provide quality sand to capital construction

chandrababu naidu, devineni uma, irrigation, capital, construction, ap, sand

Ap state govt move to provide quality sand to capital construction. cm chandrababu naidu plans to provide A grade sand to construtions in new capital city.

ఇసుక తెస్తారు.. ఇరగదీస్తారు

Posted: 04/18/2015 04:54 PM IST
Ap state govt move to provide quality sand to capital construction

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇసుక దొరకడం ఎంత కష్టం అయిందో అందరికి తెలుసు. మామూలు నిర్మాణాలకు ఇసుక దొరకడం కష్టంగా మారింది. ఒకవేళ దొరికినా, అది ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలన్నది ఏపీ నిబంధన. ఈ తరుణంలో.. అసలు ఇసుక కష్టాలు రాజధాని నిర్మాణంపై ప్రభావం చూపకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది అక్కడి ప్రభుత్వం. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ప్లాన్ చేస్తోంది ఏపి ప్రభుత్వం.  బంగారంతో సమానమైన ఇసుకను కృష్ణానది నుంచి వెలికి తీసి తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణంలో ఉపయోగించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇసుకతోపాటు వచ్చే బుసుక, మట్టితో వరదల సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, క్రిష్ణానదిలో ఉన్న ద్వీపాలను మెరక చేసి పటిష్ట పరచాలని భావిస్తున్నారు.

ప్రపంచ స్థాయి నగర నిర్మాణానికి వాడే ఇసుక విషయంలో మాత్రం ఏపీ సర్కార్ ప్రాథమిక అంచనాకు వచ్చేసింది. క్రిష్ణానదీ గర్భంలో ఉన్న అత్యంత నాణ్యమైన ఇసుకను రాజధాని నిర్మాణంలో ఉపయోగించేందుకు అధికారులు రంగం సిద్దం చేస్తున్నారు. నీటిపారుదలరంగ నిపుణులు, అధికారులతో కలిసి క్రిష్ణానదిని పరిశీలించిన మంత్రి దేవినేని ఉమ... నది నుంచి ఇసుకను వెలికి తీసే ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు ,నిపుణులు... క్రిష్ణానదిలో ఇసుక లభ్యతకు సంబంధించి ప్రాథమిక సర్వే పూర్తి చేశారు. ఇందులో ప్రకాశం బ్యారేజీ కి కిలోమీటర్ దూరంలోనే లక్షల క్యూబిక్ మీటర్ల... ఇసుక గనులు ఉన్నాయని కనుగొన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం జరిగే ప్రదేశం క్రిష్ణానది పక్కనే కాబట్టి.. ట్రాన్స్పోర్టేషన్ సమస్య పెద్దగా ఉండకపోవచ్చు. ఫలితంగా నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుందన్నది అంచనా.ఏకకాలంలో చేపట్టే భవనాల నిర్మాణానికి ఒకటీ రెండులోడ్ల ఇసుక సరిపోదు. పైగా నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసేందుకు ఆధునిక టెక్నాలజీ వాడుతున్న సమయంలో.. ఇసుక సేకరణ కూడా అంతేస్పీడ్గా ఉండాలి. దీంతో సాంకేతిక పరిజ్ఞానంతో క్రిష్ణానదిని తవ్వాలన్నది బాబు ప్లాన్.

 

**అభినవచారి**

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  devineni uma  irrigation  capital  construction  ap  sand  

Other Articles