Jayasudha responds on Rajendra prasad victory in MAA elections | Rajendra prasad | Jayasudha | MAA

Rajendra prasad is comedian and behaving so jayasudha

Jayasudha on Rajendra prasad victory, Jayasudha in MAA elections, Rajendra prasad, Jayasudha, MAA elections

Actress Jayasudha who lost MAA (Movie Artistes' Association) election to Rajendra Prasad has broken her silence and finally reacted to the outcome.

రాజేంద్రుడిపై జయసుధ అక్రోశం.. కమేడియన్ లా ప్రవర్తిస్తారా..?

Posted: 04/18/2015 02:56 PM IST
Rajendra prasad is comedian and behaving so jayasudha

మెగా బ్రదర్ నాగబాబు మద్దతు మినహా మూవీ అర్టిస్ట్ అసోసియేషన్ గెలుపుపై ఎలాంటి అంచనాలు లేనప్పటికీ విజయం సాధించిన నటకిరీటీ విజయంపై ఎట్టకేలకు సహజనటి జయసుధ స్పందించారు. రాజేంద్రప్రసాద్ కమేడియన్ నటుడే కాదని, మా ఎన్నికలలో విజయం సాధించిన తరువాత ఆయన ప్రపర్తన కూడా అలానే ఉందని అమె ఘాటుగా విమర్శించారు. మా ఎన్నికలలో ఓటమి తరువాత గత 24 గంటలుగా చోటుచేసుకున్న పరిణామాలపై ఎట్టకేలకు ఆమె తన మౌనాన్ని అధిగమించి మీడియాతో మాట్లాడారు. రాజేంద్రప్రసాద్ తనను పరిహాసం చేస్తున్నాడని, ఇది ఎంత వరకు సమంజసమని ఆమె నిలదీశారు.

మా ఎన్నికలు ముగిసిన అనంతరం ఫలితాలు వెల్లడైన తరువాత కూడా తోటి నటీ నటులతో ఈ విధంగా వ్యవహరించడం శోఛనీయమన్నారు. రాజేంద్రప్రసాద్ ప్రవర్తనతో తాను తీవ్రంగా కలత చెందుతున్నానని అన్నారు. ఆయన తన స్థాయిని, పరపతిని కాపాడుకోవాల్సిందిపోయి.. మా లోని తోటి సభ్యులనే చులకన చేసి ప్రవర్తించడం ఆయన విజ్ఞతకు తగదన్నారు. రాజేంద్రప్రసాద్ వ్యవహర శైలితో కలత చెందిన ఆమె ఇకపై మా నిర్వహించే ఎలాంటి కార్యక్రమాలు, వేడుకలకు తాను హాజరుకాబోనని తేల్చిచెప్పారు. అయితే మా సభ్యుల కోసం తాను ఏం చేయాలనుకున్నా అది బయట నుంచి సహకారం అందిస్తామన్నారు రాజేంద్రప్రసాద్ బాధ్యతాయుతంగా మాట్టాడటం లేదని, హస్యనటుడుగా వున్నా ఆయన బయట కూడా అలానే ప్రవర్తిస్తున్నారని, దీంతోనే తాను మా కార్యక్రమాలకు, వేడుకలకు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నట్లు జయసుధ తెలిపారు.

సరిగ్గా మా ఎన్నికలకు స్వల్ప వ్యవధిలో తాను పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని, రాజేంద్ర ప్రసాద్ లా తాను ప్రచారం చేయలేదని.. అందుచేతనే తాను ఓటమిపాలయ్యానని జయసుధ చెప్పారు. అయినా తాను 150 ఓట్లు సాధించానని.. ఇందుకు తాను గర్వంగా ఫీలవుతున్నానన్నారు. తన ప్యానెల్ నుంచి పోటీ చేసిన 22 మంది మా ఎన్నికలలో విజయం సాధించారని చెప్పుకోచ్చారు. మా ఎన్నికలలో తాను నైతిక విజయం సాధించానన్నారు. మా ఎన్నికలలో నూతనాధ్యక్షుడు పేద కళాకారుల కోసం పనిచేస్తారని, ఎన్నికల వాగ్ధానాలను నిలబెట్టుకుంటారని జయసుధ ఆకాంక్షించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajendra prasad  Jayasudha  MAA  

Other Articles