Sati Practice in India| Mystic Beliefs in India| Woman cremated with Husband

Is sati alive in india woman remains found husband ashes

Sati Case in Maharashtra, Sati Practice in India, Woman cremated with Husband, Woman ashes found with husband, Woman jumped into fire, Woman body found in husband’s pyre, Is Sati Alive in India, Woman remains found Husband Ashes

We have studied in history that there was a stupid practice called Sati, where the wife was burnt alive with the dead husband. But, the news story about an incident in Maharashtra’s Latur district resembles the banned practice and makes the concept a contemporary.

సతీ సహగమనమా..? యాధృశ్చికమా..? తేల్చనున్న దర్యాప్తు

Posted: 04/01/2015 06:21 PM IST
Is sati alive in india woman remains found husband ashes

స్వతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్తలు లాలా లజపత్ రాయ్, రాజా రామ్ మోహన్ రావు వంటి వారు ఎంతగానో ఉద్యమించి భారత దేశంలో సతీ సహగమనాన్ని( భర్త మరణించగానే అదే చితపై భార్య కూడా సహమగనం చేసుకునే విధానాన్ని) రూపుమాపగలిగారు. అయితే మహారాష్ట్రంలో మాత్రం ఇంకా సతీ సహగమన ఛాయలు కనబడుతున్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇందుకు ఇటీవల జరిగిన ఓ ఘటనే సందేహాలను రేకెత్తిస్తోంది.

మృతిచెందిన భర్త చితికి నిప్పంటించిన అనంతరం అదృశ్యమైన అతని భార్య.. భర్తతో పాటు తాను కాలిబూడిదై పోయింది. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. మృతుడి కుటుంబ సభ్యులు బలవంతంగా అమె చేత సతీసహగమనం చేయించారా..? అన్న సందేశాలు రేకెత్తుతున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు అసలు భార్య బర్తతో కలసి ఎలా మరణించిందన్న కోణంలో ధర్యాప్తును ప్రారంభించారు.

వివరాల్లోకి వెళ్తే.. తుకారాం అనే వ్యక్తి (55) గుండెపోటుతో ఆదివారం సాయంత్ర చనిపోయాడు. పోలీసులు కూడా అతడి మరణాన్ని ధృవీకరించారు. సోమవారం తుకారం అంత్యక్రియలు జరిగాయి. కానీ, అదే రోజు తుకారాం భార్య ఉష(50) కనిపించకుండా పోయింది. మరుసటి రోజు తుకారం చితాభస్మాన్ని తీసుకునేందుకు కుటుంబ సభ్యులు స్మశానం వద్దకు వెళ్లగా అక్కడే ఉష కూడా కాలిపోయి ఉన్నట్లు గుర్తించారు. చనిపోయిన ఆ భార్య భర్తలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, పోలీసులు మాత్రం కుటుంబంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సతీ చర్యను భారత్ ఎప్పుడో రద్దు చేసిన విషయం తెలిసిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles