Janatapariwar | Mulayam | Bihar

The merger of all janata parivar parties will be announced

janatadal, janata pariwar, all partys, mulayam,

The merger of all Janata Parivar parties will be announced in time to prepare for the Bihar Assembly elections and the six constituents have decided on the symbol and the flag of the proposed new party, its leaders said in Patna on Wednesday.

జనతాపరివార్ మరోసారి తెర మీదకు

Posted: 04/01/2015 05:04 PM IST
The merger of all janata parivar parties will be announced

జ‌న‌తాప‌రివార్ పార్టీల‌న్నీ ఒకే గొడుకు కింద‌కు రావ‌డానికి సిద్ధ‌మైంది. ఈ పార్టీల కూట‌మికి స‌మాజ్‌వాదీ జ‌న‌తా పార్టీ లేదా స‌మాజ్‌వాదీ జ‌న‌తాద‌ళ్‌గా పేరు పెట్టే అవ‌కాశం ఉంది. స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాద‌వ్ కూట‌మికి చైర్మన్‌గా వ్యవ‌హ‌రిస్తారు. జ‌న‌తాద‌ళ్ (యు) జాతీయ కార్య‌ద‌ర్శి కేసీ త్యాగి ఈ విష‌యాన్ని వెల్లడించారు. స‌మాజ్‌వాదీ పార్టీకి జ‌న‌తా ప‌రివార్ పార్టీల‌న్నిటిలోనే అత్య‌ధిక సంఖ్య‌లో పార్లమెంటు స‌భ్యులు ఉన్న సంగ‌తి తెలిసిందే. మొత్తం జ‌న‌తా ప‌రివార్ పార్టీల‌న్నిటికీ క‌లిసి లోక్‌స‌భ‌లో 15 మంది స‌భ్యులు ఉన్నారు.

పార్లమెంట్ లో స‌మాజ్‌వాదీ పార్టీకి ఐదుగురు, లాలూ ప్ర‌సాద్ నేతృత్వంలోని రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ (ఆర్‌జెడి)కి న‌లుగురు, జ‌న‌తాద‌ళ్ యునైటెడ్ (జెడియు), ఇండియ‌న్ నేష‌న‌ల్ లోక్‌ద‌ళ్ (ఐఎన్ ఎల్‌డి)ల‌కు ఇద్ద‌రేసి స‌భ్యులు ఉన్నారు. అదే రాజ్య‌స‌భ‌లో అయితే స‌మాజ్‌వాదీ పార్టీకి ప‌దిహేనుమంది స‌భ్యులు ఉండ‌గా జెడియుకి ప‌న్నెండు మంది, ఐఎన్ ఎల్ డి, జెడిఎస్‌, ఆర్‌జెడిల‌కు ఒక్కోక్క స‌భ్యుడు చొప్పున ఉన్నారు. మరి డిసెంబర్ లో మొదలై ఇప్పటికి కానీ ఓ రూపం రాని ఈ కూటమి ఎన్నికల్లో మాత్రం ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : janatadal  janata pariwar  all partys  mulayam  

Other Articles