Congress Accepted 'Fair-Skinned' Sonia Gandhi as Leader

Union minister giriraj singh s says congress accepted fair skinned sonia gandhi as leader

Congress Accepted 'Fair-Skinned' Sonia Gandhi as Leader, Union Minister Giriraj Singh's Controversial statements, Giriraj Singh is being pummeled on social media, Congress accepted Sonia Gandhi, Minister Giriraj Singh's Shocking Remark on Sonia Gandhi, Minister Giriraj Singh's Controversial Remark on Sonia Gandhi, Minister Giriraj Singh's on Sonia Gandhi,

Controversial BJP leader Giriraj Singh is being pummeled on social media for his comment that Congress accepted Sonia Gandhi as its leader only because she is "fair-skinned."

సోనియాగాంధీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Posted: 04/01/2015 02:00 PM IST
Union minister giriraj singh s says congress accepted fair skinned sonia gandhi as leader

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై బీజేపీ నేత, కేంద్ర చిన్న, మధ్య తరహా ప్రభుత్వ రంగ సంస్థల శాఖ సహాయ మంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా ఆయన వర్ణ వివక్షకు తెరలేపారు. బీజేపి ఎంపీలు, కేంద్ర మంత్రులు అందరూ తమ నోళ్లను అదుపులో పెట్టుకుని, హోదాకు తగినట్లుగా నడుచుకోవాలని స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఇటీవల సూచించినా.. ప్రత్యర్థి పార్టీలపై బీజేపి ఎంపీలు, కేంద్రమంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలు ఆగడం లేదు.

తాజాగా, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెల్లటి శరీరవర్ణంతో వున్నందువల్లే కాంగ్రెస్ పార్టీ అద్యక్షురాలు అయిందని గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని రాజీవ్గాంధీ నైజిరీయా దేశస్తురాలిని వివాహం చేసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యాలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యాలు బీజేపీ మైండ్సెట్కు అద్దం పడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. సోనియాకు వెంటనే క్షమాపణలు చెప్పాలని గిరిరాజ్ సింగ్ను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Giriraj Singh  Sonia Gandhi  Congress  

Other Articles