Supreme Court stays summons for former Prime Minister Manmohan Singh in coal scam case

Sc stays summons for manmohan singh issues notices to cbi

SC stays summons for Manmohan Singh, Supreme Court stayed summons to former Prime Minister Manmohan Singh, Supreme Court issues notices to CBI, temporary relief to Manmohan singh, Coal-Gate, coal scam, former Prime Minister Manmohan Singh, accusations of criminal conspiracy on manmohan singh, manmohan corruption in Odisha coal field, Supreme Court, congress, sonia gandhi, rahul gandhi

The Supreme Court has stayed the summons to former Prime Minister Manmohan Singh and five others by a Delhi court in connection with the mega coal scam dubbed "Coal-Gate."

మాజీ ప్రధానికి మన్మోహన్ కు సుప్రీంకోర్టులో ఊరట

Posted: 04/01/2015 12:06 PM IST
Sc stays summons for manmohan singh issues notices to cbi

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. బొగ్గు కుంభకోణం కేసులో మన్మోహన్కు... సీబీఐ కోర్టు జారీ చేసిన సమస్లపై న్యాయస్థానం ఇవాళ స్టే విధించింది.  ఈ మేరకు సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా బొగ్గు స్కాం కేసులో నిందితుడిగా విచారణకు హాజరు కావాలని సీబీఐ కోర్టు సమన్లు జారీచేయడాన్ని వ్యతిరేకిస్తూ  మన్మోహన్ సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కోర్టు తన పిటీషన్ పై ఎలా స్పందిస్తుందోనని ఉత్కంఠగా ఎదురుచూసిన కాంగ్రెస్ వర్గాలకు ఊరట లభిించింది. తీర్పు నేపథ్యంలో కోర్టుకు హాజరైన మన్మోహన్ సింగ్ తనయలు న్యాయస్థానం తీర్పుపై సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఒడిశాలోని తలాబిరా-2 బొగ్గుబ్లాకును హిందాల్కోకు కేటాయించడంపై దాఖలైన కేసులో మన్మోహన్‌ను నిందితుడిగా కోర్టు పేర్కొంటూ ఏప్రిల్ 8న నిందితుడిగా విచారణకు హాజరుకావాలని సీబీఐ కోర్టు సమన్లు ఇచ్చింది. తనకు సమన్లు జారీ చేయడం సమంజసం కాదని మన్మోహన్ పిటిషన్‌ తన పిటిషన్లో పేర్కొన్నారు.

కాగా మాజీ ప్రధానికి సీబిఐ సమన్లు జారీ చేయడంపై కాంగ్రెస్ తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది. ఢిల్లీలో మన్మోహన్ మద్దతుగా భారీ ర్యాలీలు నిర్వహించింది. మన్మోహన్ సఛ్చీలతను దేశంలోని ఎవరిని అడిగినా చెబుతారని, అలాంటి ఆయనకు సీబిఐ నోటీసులను జారీచేయడం ఎంత వరకు సమంజసమని కాంగ్రెస్ నేతలు కూడా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మన్మోహన్ సమస్లపై స్టే విధించడాన్ని కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  Manmohan Singh  coal scam  Odisha  

Other Articles