Narayana | Ap | Chandrababu

Cpi leader narayana attacked on ap cm chandrababu naidu

cpi, narayana, chandrbabu, singapur, andhrapradesh, tirupathi

cpi leader narayana attacked on ap cm chandrababu naidu.he said that chandrababu naidu wasteing the money to travel from ap to singapor.

నారాయణ మాటలు చంద్రబాబు విన్నాడంటేనా..!

Posted: 03/31/2015 01:14 PM IST
Cpi leader narayana attacked on ap cm chandrababu naidu

సీపీఐ నేత నారాయణ మాటల గారడి గురించి అందరికి తెలుసు. ఆయన మాటలు కొందరికి కోపం తెప్పిస్తుంటే మరి కొందరికి మాత్రం భలేగా అనిపిస్తాయి. ఏ విషయాన్నైనా ముక్కు సూటిగా చెప్పడం నారాయణ స్టైల్. ఆ మధ్య చికెన్ వ్యవహారంతో వార్తలకెక్కారు. అయితే తాజాగా ఏపి సిఎం చంద్రబాబు నాయుడుపై తనదైన స్టైల్ లో మాటల తూటాలు పేల్చారు.
కేంద్రం సవతితల్లి ప్రేమ చూపుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారని ఆయన అన్నారు. అంతేనా ఏపి సిఎం చంద్రబాబు వ్యవహారం హరికథలో పిట్టకథలాగా  ఉందని కూడా చమత్కరించారు.

ఏపి సిఎం చంద్రబాబు నాయుడు వ్యవహారంపై తన మాటల తూటాలను పేల్చిన నారాయణ అంతటితో ఆగకుండా సింగపూర్ టూర్ పైనా విమర్శలు గుప్పించారు. తిరుపతి అంతకూడా లేని సింగపూర్ కు చంద్రబాబు మళ్లీ మళ్లీ వెళ్లడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం తీరు చూస్తుంటే పరమానందయ్య శిష్యుల కథ గుర్తుకొస్తోందన్నారు. ప్రజలకు పంగనామాలు పెట్టి పెద్ద పెద్ద భవనాల్లో పాలన చేస్తే ఉపయోగం ఏంటని నిలదీశారు. రుణమాఫీ అమలు చేసి చెట్టుకింద పరిపాలన చేసినా హర్షించే వాళ్లమని చెప్పారు. విజయమాల్య తరహాలో చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో చక్కుర్లు కొడుతున్నారని.. చివరకు ఆయనకు పట్టిన గతే పడుతుందేమో చెప్పలేమన్నారు. రాజధాని పేరుతో హంగామా చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉందని నారాయణ అన్నారు. మొత్తానికి మీడియా సమావేశంలో చంద్రబాబు గురించి మాట్లాడుతున్నంత సేపు మీడియా మిత్రులకు కూడా భలే టైంపాస్ అయిందట. అయినా నారాయణ మాట్లాడటం.. పంచ్ పేలకపోవడం కూడా అని మీడియా వారే అనుకుంటున్నారట. మరి నారాయణా తమాషానా..

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cpi  narayana  chandrbabu  singapur  andhrapradesh  tirupathi  

Other Articles