yogendra yadav and prashant bhushan new party | arvind kejriwal aam aadmi party

Yogendra yadav and prashant bhushan planning to make new party against kejriwal

yogendra yadav, prashant bhushan, aravind kejriwal, arvind kejriwal news, delhi politics, aap crisis, aap controversy, yogendra yadav press meet, prashant bhushan press meet, arvind kejriwal press meet, aap party, aam aadmi party updates, lokpal ramdas, medha patkar

yogendra yadav and prashant bhushan planning to make new party against kejriwal : aap former leaders yogendra yadav and prashant bhushan planning to make new party against kejriwal to compete for eleminating them aap.

కేజ్రీవాల్ ‘ఆప్’ పక్కన ‘మేము’ అంటున్న యోగేంద్ర, భూషణ్

Posted: 03/31/2015 12:57 PM IST
Yogendra yadav and prashant bhushan planning to make new party against kejriwal

ఇటీవలే పలు అంశాలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై బహిరంగంగా విమర్శలు చేసిన ‘ఆప్’ సీనియర్ సభ్యులైన ప్రశాంత్ భూషణ్, యోగేంద్రలపై ఆ పార్టీ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే! గతకొన్నాళ్ల వరకు ‘ఆప్’లో సాగిన ఈ విభేదాలు రసాభసాగా మారి, తారాస్థాయికి చేరిన అనంతరం చివరికీ ఆ పార్టీ వారిని జాతీయ కౌన్సిల్ నుంచి తీసేసేలా నిర్ణయం తీసుకుంది. దీంతో తీవ్రమనోవేదనకు గురైన వారిద్దరు.. మీడియాముందు తమ గోడును వెల్లబెట్టుకున్నారు. అటు ‘ఆప్’లో ఎటువంటి సమస్యాలేదని, అన్ని ఆందోళనలు తొలిగిపోయాయంటూ కేజ్రీవాల్ ప్రకటించేశారు. ఇంతటితో ఈ వివాదం సద్దుమణిగిందని అంతా అనుకున్నారు కానీ.. యోగేంద్ర, భూషణ్ మరోసారి ‘ఆప్’కి షాకిచ్చేందుకు తెరమీదికొచ్చారు.

తమను తొలగించడంపై పార్టీ చర్యలను తీవ్రంగా పరిగణించిన యోగేంద్ర, భూషణ్.. ‘ఆప్’లో వున్న అసంతృప్తులను తమ దరికి చేర్చుకొని కొత్త పార్టీ స్థాపించాలని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజ్యాంగనిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14వ తేదీన తమ మద్దతుదారులతో కీలక భేటీ నిర్వహించేందుకు వీరు ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ‘ఆప్’లో లోక్ పాల్ స్థానం నుంచి బహిష్కరణకు గురైన రాందాస్ తోపాటు ఆ పార్టీని వీడిన సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్, ఇంకా తదితరులను తమ భేటీకి వారిద్దరు ఆహ్వానిస్తున్నారు. కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ పెట్టాలనే ఉద్దేశంతోనే వారు ప్రణాళికలు చేపడుతున్నారు. మరి.. వీళ్లు పార్టీ పెడతారా..? లేదా..? అన్నది తెలియాలంటే మరికొన్నాళ్లపాటు వేచి వుండాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yogendra yadav  prashant bhushan  arvind kejriwal  aam aadmi party  

Other Articles