learn english but never forget mother language | Telugu English

Learn english but never forget mother language

Venkaiah naidu praises pm modi, Venkaiah naidu takes on congress, modi a man of action than words, union minister venkaiah naidu, venkaiah naidu on prime minister, venkaiah on Pm modi, venkaiah at tirupathi

Union minister m venkaiah naidu says students to learn english, but never forget mother language

ఆంగ్లము ముద్దు.. కానీ తెలుగును మరవద్దు..

Posted: 03/28/2015 08:42 PM IST
Learn english but never forget mother language

మనం ఎక్కడికి వెళ్లినా మాతృభూమిని మర్చిపోవద్దని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రతి ఒక్కరు ఇంగ్లిష్‌ నేర్చుకోవాలని, కానీ తెలుగును మర్చిపోవద్దని సూచించారు. తిరుపతిలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు భూమి పూజ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తం భారత్‌వైపు చూస్తోందన్నారు. దేశంలోనే రివల్యూషన్‌ తెచ్చిన గొప్ప నాయకుడు ప్రధాని నరేంద్రమోదీ అని అన్నారు. భారతీయుల సత్తా చూసి ప్రపంచం అబ్బుర పడుతోందన్నారు. మూడు విద్యా సంస్థలకు ఒకే చోట శంకుస్థాపన చేయడం చరిత్రలో ఎక్కడా జరగలేదన్నారు. ఐఐఎస్‌ఈఆర్‌ వస్తే తెలివి పెరుగుతుందని అన్నారు. ఇక్కడి విద్యాసంస్థలకు వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉంటాయన్నారు.

రెండు రాష్ర్టాలుగా విడిపోయినా మనమంతా తెలుగు వాళ్లమేనన్నారు. మనం ఎక్కడికి వెళ్లినా జన్మభూమిని, మాతృభాషను మర్చిపోవద్దని, మర్చిపోయిన వాడు మనిషే కాదన్నారు. విద్యార్థులు విదేశాలకు వెళ్లడం తప్పు కాదని, జ్ఞానం సంపాదించేందుకు వెళ్లాలని సూచించారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను కేంద్రం అమలు చేసి తీరుతుందని, ఏపీకి రైల్వే జోన్‌ వచ్చి తీరుతుందని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నేతలు మాటలు చెప్పారని, తాము చేతల్లో చూపిస్తామని పేర్కొన్నారు. మోదీ మాటల మనిషి కాదని, చేతల మనిషని వెంకయ్య కితాబిచ్చారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venkaiah naidu  English  mother language  

Other Articles