మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మరింత వేడెక్కుతున్నాయి. గతంలో మా ప్రెసిడెంట్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన మురళీమోహన్ పై పలు రకాల ఆరోపణలు ఉన్నాయి. మురళీమోహన్ ఆధ్వర్యంలో ఎన్నో అవకతవకలు ఉన్నాయంటూ ఓ కల్యాణ్ మీడియా ముందుకు వచ్చారు. ఆర్థికపరమైన అవకతవకలపై అసోసియేషన్కు ఎన్నో ఉత్తరాలు రాశానని, ఒక్క ఉత్తరానికీ మురళీ మోహన్ నుండి సమాధానం రాలేదని కల్యాణ్ తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే మీ ముందుకు వచ్చానని.. రాజకీయ పార్టీల్లో కూడా ఇంత వ్యతిరేకత లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అసలు మా లో ఎప్పుడూ లేనంతగా ప్రత్యేకంగా ఎలక్షన్స్ ఉన్నాయంటూ నోటీసుబోర్డులో పెట్టారని ఆరోపించారు. 'మా' డబ్బును మురళీ మోహన్ 5 లక్షలు దేవాలయాలకు ఇచ్చారు. ఇలా సినీ కార్మికుల డబ్బులను తన ఇష్టానుసారంగా వాడుకున్నారని ఆరోపణ ఉంది. అయితే కళ్యాణ్ తాను కూడా గుడి కట్టిస్తానని, మరి తనకూ అలాగే డబ్బులు ఇస్తారా ? అని ప్రశ్నించారు. 'మా' డబ్బును మురళీమోహన్ వేరే వాళ్లకు ఎందుకు ఇస్తారు.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీఎల్ క్రికెట్ వెనుక మురళీమోహన్ ఉన్నారు. సిసిఎల్ రెండు కోట్లు రూపాయలు వసూలయ్యాయి. అయితే అందులోంచి కనీసం ఒక్క పేద ఆర్టిస్టునైనా ఆదుకున్నారా. మూ వీ ఆర్టిస్ట్ డైరీ పేరుతో ఐదు లక్షలు ఖర్చు చేశారు. తరువాత మోహన్ బాబు దీనిపై ప్రశ్నిస్తే అప్పుడు తిరిగి చెల్లించారు. మా కు ఓ కంపెనీ డబ్బులు బాకీ ఉన్నా, వసూలు చెయ్యడంలో ఎందుకు నిర్లక్షంగా వ్యవహరించారు. అడిగితే మురళీ మోహన్ గారు మా నష్టాల్లో ఉందని అన్నారు. కానీ తీరా చూస్తే ప్రాఫిట్ లో ఉంది. కానీ అది వాస్తవం కాదు చెమట ఓర్చి క్రికెట్ ఆడి డబ్బులు సంపాదిస్తుంటే ఆయన మాత్రం నీళ్లలా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. అయితే మా డైరీ పై మురళీ మోహన్ కు సంబందించిన వ్యక్తి ఫోటోలు ప్రచురించారు. మా డబ్బులను గుడికి ఇస్తున్నానని కనీసం చెప్పలేదు. కనీసం ప్యానెల్ లో చర్చించలేదు కూడా. అంతగా ఇవ్వాలనుకుంటే మీ పాకెట్ లో ఇవ్వండి అంటూ కళ్యాణ్ మండిపడ్డారు. మురళీ మోహన్ తీసుకుంటున్న స్వంత నిర్ణయాలతొ మా కు నష్టం కలుగుతొందని అన్నారు.
Video Courtesy : sakshi
హైలెట్స్ ..
మురళీ మోహన్ తీసుకున్న నిర్ణయాలన్నీ ఏకపక్షమే
అసలు మా ఎన్నికలు ఇలా జరుగున్నందుకు సిగ్గు పడుతున్నాను
ఒకరిని ఒకరు తిట్టుకోవడం మామూలైపోయింది
ఇది అసలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషనేనా అనే అనుమానం కలుగుతోంది.
మూ వీ ఆర్టిస్ట్ బైరీ పేరుతో ఐదు లక్షలు ఖర్చు చేశారు
మా నష్టాల్లో ఉందని అన్నారు. కానీ తీరా చూస్తే ప్రాఫిట్ లో ఉంది
ఆర్టిస్టులు క్రికెట్ ఆడి డబ్బులు సంపాదిస్తుంటే ఆయన మాత్రం నీళ్లలా ఖర్చు చేస్తున్నారు
మా డైరీ పై మురళీ మోహన్ కు సంబందించిన వ్యక్తి ఫోటోలు ప్రచురించారు
మా డబ్బులను గుడికి ఇస్తున్నానని కనీసం చెప్పలేదు.
మురళీ మోహన్ తీసుకుంటున్న స్వంత నిర్ణయాలతొ మా కు నష్టం.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more