Germanwings | Copilot | 150 Dead

German wings co pilot was a psycho

German, Germanwings, French, Airbus, psycho, Alps, suicide, aircraft

german wings co pilot was a psycho. The Germanwings co-pilot who crashed his Airbus in the French Alps, killing all 150 aboard, told his ex-girlfriend that "one day everyone will know my name", according to German newspaper Bild.

ఆ పైలెట్ ఓ సైకో.. తన ఆత్మహత్యే 149 మంది చావులకు కారణం

Posted: 03/28/2015 03:56 PM IST
German wings co pilot was a psycho

పిచ్చోడి చేతిలో రాయి.. అది ఎవరి మీదకు పడుతుందో తెలియదు అని మామూలుగా మనం మాట్లాడుకుంటాం. అదే విధంగా ఓ సైకో కు ఏకంగా నడపమని ఫ్లైట్ ఇస్తే ఏం చేస్తాడో ఎవరూ ఊహించరు. జర్మనీ వింగ్స్ విషాదంలో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. జర్మన్ కో పైలెట్ ఓ మాసిక రోగి. ప్రమాదం జరగడానికి ముందు రోజు వరకు కూడా అతను చికిత్స చేయించుకున్నాడంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆండ్రియాస్ లూబిడ్జ్ గర్ల్ ఫ్రెండ్, రెండు వారాల క్రితం అభిప్రాయ భేదాలొచ్చి తనతో విడిపోయింది. అప్పటి నుంచి ఆయన మానసిక జబ్బు మళ్లీ తిరగతోడిందని, అందుకోసం సైకో థెరపీ కింద కౌన్సెలింగ్ తీసుకుంటూ వచ్చాడని తాజాగా తేలింది. తీవ్ర మనస్తాపంతో రగిలిపోతున్న టూబిడ్జ్ విమానాన్ని కూల్చేయడం ద్వారా ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలుస్తోంది. అయితే తన గర్ల్ ఫ్రెండ్ తో ఏదో ఒక రోజు నేను మొత్తం సిస్టం ను మార్చే పనిని చేస్తానని, ప్రపంచం నన్ను ఖచ్చితంగా గుర్తించుకుంటుదని అన్నట్లు సమాచారం.

విమాన ప్రమాద సంఘటనపై వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్న పోలీసు అధికారుల బృందం గురువారం నాడు నాలుగు గంటలపాటు మోంటబార్‌లోని కో-పైలట్ లూబిడ్జ్ ఫ్లాట్‌ను శోధించగా ఓ గర్ల్ ఫ్రెండ్‌తో వ్యవహారం ఉన్నట్టు, మానసిక వ్యాధికి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. . అయితే అన్ని పరీక్షలతోపాటు, మానసిక పరీక్షల్లో కూడా ఉత్తీర్ణుడయ్యాకే ఆయన్ని పైలట్గా ఎంపిక చేశామని కార్‌స్టెన్ స్పార్ తెలిపారు. లూబిడ్జ్ నివాసంలో దొరికిన పత్రాల ప్రకారం విమాన ప్రమాదం జరిగిన ముందు రోజు వరకు కూడా మానసిక వ్యాధికి కో-పైలట్ కౌన్సెలింగ్ తీసుకుంటూ వచ్చాడు. విమానం ఎక్కే సందర్భాల్లో కూడా డాక్టర్ సలహా తీసుకున్నాకే విమానాన్ని నడపాల్సి ఉంటుందని కూడా ఆయనకు వైద్యం చేస్తున్న సైకాలజిస్ట్ సూచించారు. మొత్తానికి ఏ పాపం తెలియని, కనీసం ఒకరికి ఒకరు కూడా తెలియని 149 మందిని ఒకే ఒక్కడు పొట్టన పెట్టుకున్నాడు. గాలిలో ప్రయాణాన్ని శాశ్వత ప్రయాణంగా మార్చాడు ఆండ్రియాస్ లూబిడ్జ్. అయితే లుఫ్తాన్సా వంటి బడా కంపెనీ ఇలాపైలెట్ పరిస్థితి ఏంటో కూడా తెలుసుకోకుండా విమానాన్ని అప్పగించడం ఏంటని ఇప్పుడు యావత్ ప్రపంచం ప్రశ్నిస్తోంది. చనిపోయిన వారి కుటుంబాలకు ఎంతో కొంత పరిహారాన్ని పడేసినంత మాత్రాన మనుషులు మాత్రం తిరిగి వస్తారా.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : German  Germanwings  French  Airbus  psycho  Alps  suicide  aircraft  

Other Articles