Bank holidays may hit salary payments | 62308

Bank holidays may hit salary payments

bank holidays, bank problems, sbi bank holidays, bank customers, reserve bank of india, sri rama navami festival, bhadrachalam temple, lord sriram ram sita marriage, telangana banks, andhra pradesh bank details, bank holiday problems

Noting with concern the number of bank holidays between March 28 and April 5, industry body Assocham on Thursday sought the intervention of the Reserve Bank of India (RBI) as well as the government to make “some arrangements” to avoid inconvenience to customers.

బ్యాంకులకు వరుస సెలవులు.. వినియోగదారులు బెంబేలు..

Posted: 03/27/2015 09:36 PM IST
Bank holidays may hit salary payments

శ్రీరామ నవమి పండుగతో మొదలు కానున్న వరుస సెలవులతో బ్యాంకు వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. శనివారం నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. మధ్యలో రెండు రోజులు మినహా వరుసగా 5 రోజుల సెలవులతో బ్యాంక్‌ ఉద్యోగులు ఆనందంగా ఉంటే కస్టమర్లు మాత్రం ఆందోళన చెందుతున్నారు. మధ్యలో మార్చి 30, 31వ తేదీల్లో కొన్ని బ్యాంకులు మాత్రమే పని చేయనున్నాయి.

మార్చి 31తో ఈ ఆర్థిక ఏడాది ముగుస్తుండడంతో సెలవులకు ఓ కారణం కాగా... ఆ తర్వాత వచ్చే ఫైనాన్షియల్‌ ఇయర్‌ ప్రారంభంలో పండుగలు క్యూ కట్టడం మరో కారణం. మార్చి 28 శ్రీరామ నవమి ప్రభుత్వ సెలవు. మార్చి 29, ఏప్రిల్‌ 1 అకౌంట్స్‌ క్లోజింగ్‌ సందర్భంగా బ్యాంకులు సెలవు దినాలు పాటించనున్నాయి. ఏప్రిల్‌ 2న మహవీర్‌ జయంతి, ఏప్రిల్‌ 3న గుడ్‌ ఫ్రైడే కావడంతో వరుసగా ఆ రెండు రోజులు బ్యాంకులకు సెలవు. ఏప్రిల్‌ 4న శినివారం పనిదినం అయినప్పటికీ ఏప్రిల్‌ 5న మళ్లీ బ్యాంక్‌లకు ఆదివారం సెలవు. వరుస సెలవులు రావడం బ్యాంక్‌ ఉద్యోగులకు సంతోషంగా ఉన్నప్పటికీ అత్యవసర పనులు ఉన్నవారికి మాత్రం ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bank  Holidays  inconvenience to customers  RBI  

Other Articles