Sonia Gandhi slams PM Narendra Modi govt on land bill

Sonia gandhi slams opposition on land reforms says it is not anti national

congress president sonia gandhi, sonia gandhi, sonia gandhi takes on NDA government, Sonia Gandhi slams PM Narendra Modi government on land bill, Sonia gandhi fires on NDA government, Land ordinance, PM MODI, NDA Govt

Chiding the government for painting those opposing its land bill as anti-nationals, Gandhi asked the government to "rise above its narrow-minded politics"

మోడీ ప్రభుత్వంపై సోనియా నిప్ఫులు.. భూసేకరణ బిల్లుపై లేఖ

Posted: 03/27/2015 09:31 PM IST
Sonia gandhi slams opposition on land reforms says it is not anti national

ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ధ్వజమెత్తారు. భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా కేంద్రంపై సోనియాగాంధీ విమర్శలు తీవ్రతరం చేశారు. భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న పార్టీలను దేశాభివృద్ది వ్యతిరేక పార్టీలని ప్రచారం చేస్తున్న ప్రభుత్వ తీరుపై అమె నిప్పుటు చెరిగారు. తమ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన భూ సేకరణ బిల్లుతో.. అటు అభివృదితో పాటు భూములు కోల్పోతున్న రైతులకు కూడా మేలు జరిగేలా వుందని, దానని సవరించిన ఎన్డీఏ ప్రభుత్వ రైతు వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు.

రైతులు, పేదల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక, పేదల వ్యతిరేక కార్యక్రమాలకు స్వీకారం చుట్టిందని మండిపడ్డారు. భూ సేకరణ చట్టం బిల్లుపై అమె సంబంధిత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సోనియా లేఖ రాశారు. భూసేకరణ సవరణ బిల్లు రైతులకు నష్టం చేసేలా ఉందన్నారు. ఈ బిల్లులో ఏ ఒక్క అంశాన్ని సవరించినా.. జాతి వెన్నుముక్కను విరిచినట్లేనని అమె పేర్కోన్నారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ తాము చేస్తున్న ఉద్యమాలపై ప్రజలకు అబద్దాలను చెబుతూ.. తప్పుదోవ పట్టించే యత్నాలను ప్రభుత్వం మానుకోవాలని సూచించారు.

ఈ తరహా చర్యలతో తాను పోరబాటున కూడా ఆశ్చర్యానికి లోనుకానని, లాజిక్ లు లేకుండా మాట్లాడటం, తమ వాదనలను సమర్థించుకునే ప్రభుత్వం ఇంతకన్నా ఏం చేస్తుందని ఆమె తన లేఖలో ప్రశ్నించారు. ఈ బిల్లు వల్ల ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతులు నష్టపోతారని ఆమె శుక్రవారం రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే భూసేకరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వం చేయబోతున్న సవరణలను కాంగ్రెస్ పార్టీ ఆమోదించదని సోనియాగాంధీ తెలిపారు. భూ సేకరణ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆందోళనలు చేస్తుందని, ఇకపై కూడా చేస్తామని అమె స్పష్టం చేశారు. తమతో కలసివచ్చే మిత్రులతో కలసి ఉద్యమాన్ని దేశ వ్యాప్తంగా నిర్వహింస్తామన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonia gandhi  Land ordinance  PM MODI  NDA Govt  Nitin Gadkari  

Other Articles