PrashantBhushan | YogendraYadav | Arvind Kejriwal

Prashantbhushan and yogendrayadav commented on arvind kejriwal

aap, Prashant Bhushan, Yogendra Yadav, kejriwal, delhi

AAP’s troubles are mounting as dissidents Prashant Bhushan and Yogendra Yadav have launched a massive attack on Arvind Kejriwal. They said Kejriwal was stifling internal democracy and was adopting unfair means to centralize power.

కేజ్రీవాల్ నియంత.. ప్రశ్నిస్తే ఊరుకోరు

Posted: 03/27/2015 05:36 PM IST
Prashantbhushan and yogendrayadav commented on arvind kejriwal

పార్టీ పెట్టడం దగ్గరి నుండి ఢిల్లీలో విజయం వరకు అన్నింటా సంచనాలకు మూలకారణమైన ఆప్ లో ప్రస్తుతం విభేదాల సెగ రగులుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఆప్ అసమ్మతి నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ బహిరంగంగా విమర్శలు గుప్పించారు. నిన్నటి దాకా మీడియా ముందు మాట్లాడని ఇద్దరు నేతలు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై సంచలన వ్యాఖ్యలతో విరుచుపడ్డారు. కేజ్రీవాల్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. స్వరాజ్ పార్టీ అని చెప్పుకుంటున్న పార్టీలో స్వరాజ్యం ఎక్కడ ఉంది అని వారు ప్రశ్నించారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి తాము ప్రయత్నించామని వచ్చిన ఆరోపణలపై వారు మండిపడ్డారు. ఆరోపణల్లో ఎలాంటి నిజాలు లేవని వారు వారు వాదిస్తున్నారు. పార్టీకి విజయానికి తమ వంతుగా ఎంతో నిబద్దతతో పని చేశామని ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లు తెలిపారు.
 
ఎవరైనా కేజ్రీవాల్ ను ప్రశ్నించే వారిని అస్సలు సహించరని ఆప్ రెబల్ నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ కి అధికారం, అవినీతి నిర్మూలన లాంటి ఉన్నత ఉద్దేశాలతో ప్రారంభించిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అని వారు పేర్కొన్నారు.  తమ పార్టీమీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీకి అధికారాన్ని కట్టబెట్టారన్నారి వారు తెలిపారు. అలాంటి పార్టీ ఆశయాలను నీరుగార్చే ప్రయత్నాలను సహించమనీ. పార్టీని రక్షించుకోవడానికి పోరాడతామన్నారు. కేజ్రీవాల్ను జాతీయ కన్వీనర్గా  రాజీనామా చేయాలని తాము కోరలేదని మరోసారి  స్పష్టం చేశారు.  మేం పదవి, అధికారం, సాయం  కోరడంలేదు. పార్టీలో ప్రజాస్వామ్యానికి సంబంధించి మా డిమాండ్లను తీరిస్తే పార్టీకి రాజీనామా చేస్తామని తేల్చి చెప్పారు. మొత్తానికి నిన్నటి దాకా ముసుగులో కుమ్ములాటగా సాగిన వివాదం ఇప్పుడు బహిర్గతమైంది. నిన్నటి దాకా మీడియా నుండి తప్పించుకొన్న నాయకులు, మీడియాను పిలిపించి మరీ తిట్ల దండకాన్ని చదివేస్తున్నారు. మరి పార్టీపై దాదాపుగా తిరుబాటు బావుటా ఎగరవేసిన ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లపై శనివారం నాటి నేషనల్ కౌల్సిల్ మీటింగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aap  Prashant Bhushan  Yogendra Yadav  kejriwal  delhi  

Other Articles