Goa village bans kissing in public, couples and holidayers obscene behaviour

Goa village bans kissing in public

Goa village bans kissing in public, Goa village panchayat banned kissing, couples and holidayers obscene behaviour in Goa, obscene behaviour creates nuisance in Goa, localites faces nuisance, Salvador do Mundo village panchayat in goa, Goa villages bans open boosing and loud music, Goa bans consumption of liquor and playing loud music openly, Reena Fernandes, deputy sarpanch of Salvador do Mundo

A village panchayat in Goa has "banned" kissing in public holding that "such obscene behaviour" by some couples and holidayers creates nuisance to the local people.

బహిరంగ చుంభనం వద్దు.. హద్దుల్లో వుంటేనే ముద్దు..

Posted: 03/27/2015 02:03 PM IST
Goa village bans kissing in public

గోవా.. అ పేరు చెప్పగానే. యువత దెగ్గర్నించి.. మధ్య వయస్కుల వరకు అందరికి అదోక అహ్లాదకర ప్రదేశం. మరోలా చెప్పాలంటే భారత దేశంలో విదేశీ సంస్కృతితో కొలువైన రాష్ట్రం. విందు, వినోదం తారాస్థాయికి చేరే ప్రాంతం. అంతేకాదండి అనునిత్యం పచ్చతోరణంలా.. నిత్యం విదేశీ పర్యటకులతో తాకిడితో కళకళలాడే గోవాలో. వారి సందడికి మనవారు జతకడితే.. ఆ వాతావరణం భలే షుషారు తెప్పిస్తుంది. సముద్ర తీరాల వెంట.. హోరుగా వీచే పవనాలతో కదులుతున్న అలల పరవళ్లు.. వాటిని చీల్చుకుంటూ కేరింతల మధ్య సాగే పర్యాటకులు ఈతలు, స్నానాలు, మోటార్ బోట్ బైకుల విన్యాసాలు అన్ని ఇన్నీ కావు. చూసిన వాళ్లకు చూసినంత.. కన్నుల పండుగ. బహిరంగ చుంభనాలు.. ఎక్కడ పడితే అక్కడ టాటూలు, మద్యం లాగించడాలు, కార్లు, జీపులలో పెద్దగా సౌండ్ పెట్టుకుని పార్టీలు. అంతేకాదు బికినీలు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలా వున్నాయి.

అలాంటి గోవా రాష్ట్ర రాజధాని పానాజీకి అత్యంత చేరువైన గ్రామంలో మాత్రం కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. పాశ్చాత సంస్కృతి నీలినీడలు పడి.. తమ గ్రామాంలోని ప్రజలు చెడు పద్దతులకు అలవాటు పడే ప్రమాదముందని సల్వాదర్ డో ముండో  గ్రామ పంచాయితీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విపరీత ధోరణులను నియంత్రించాల్సిన అవసరం ఉందని, అందుచేతే తామ గ్రామ పంచాయతి ఈ మేరకు నిర్ణయం తీసుకుందని గ్రామ ఉపసర్పంచ్ రీనా ఫెర్నాండెస్ చెప్పారు. తమ గ్రామంలో ఇక నుంచి బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడంపై నిషేధం విధించామని చెప్పారు.

గోవాకు వస్తున్న పర్యాటకుల్లో కొన్ని జంటలు మందు తాగుతూ పెద్దగా మ్యూజిక్ పెట్టుకుని పబ్లిక్‌గా ముద్దులు పెట్టుకుంటూ విస్తుగోలిపే చర్యలకు కూడా పాల్పడుతున్నారని, దీనిపై తమ గ్రామ ప్రజల నుంచి పెద్ద ఎత్తున పిర్యాదులు అందాయని, దీంతో తాము ఈ మేరకు పంచాయితీలో తీర్మాణం చేశామని చెప్పారు. దేశీయ పర్యటకులతో పాటు విదేశీ పర్యాటకుల ఈ మేరకు సూచిస్తూ.. తమ గ్రామ పరిధిలో బ్యానర్లు, పోస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తమ గ్రామ ప్రజల శ్రేయస్సు కోరి తీసుకున్న నిర్ణయానికి పర్యాటకులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే గోవా సంస్కృతిక శాఖ జారీ చేసిన డ్రెస్ కోడ్ నిబంధనలు ఒక వైపు చర్చనీయాంశంగా మారగా, మరోవైపు  సల్వాదర్ డో ముండో గ్రామ పంచాయతీ తీర్మాణం కూడా తోడవ్వడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Goa  Salvador do Mundo  kissing in public  open boosing  

Other Articles