Employees | Afraid | Chandrababu

Ap cm chandrababu naidu said that govt officers are afraid

ap, govt, employees, hydebad, capital, chandrababu

ap cm chandrababu naidu said that govt officers are afraid. ap cm chandrababu naidu said that govt employees are very afraid to move from hyderabad.

ఉద్యోగులు రమ్మంటే భయపడుతున్నారు

Posted: 03/27/2015 01:58 PM IST
Ap cm chandrababu naidu said that govt officers are afraid

ప్రభుత్వం నడవాలన్నా, ఎలాంటి పనులను చెయ్యాలన్నా అన్నింటిని ముందుండి నడిపించేది ప్రభుత్వ ఉద్యోగులు. అయితే అలాంటి ఉద్యోగులు రమ్మంటే భయపడుతున్నారని ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో వెల్లడించారు. అయితే ఉద్యోగులు వీలైనంత తొందరగా రావాలని కూడా సదరు ముఖ్యమంత్రి కోరుతున్నారు. ఇంతకీ ఆ ముఖ్యమంత్రి ఎవరా అనుకుంటున్నారా.. ఇంకెవరు గతంలో తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తొమ్మిది సంవత్సాలు పని చేసిన నారా చంద్రబాబు నాయుడు. ఇంతకీ చంద్రబాబు ఎందుకలా అనాల్సి వచ్చిందో తేలియాలా.... అయితే చదవండి.

కొత్తగా విడిపోయి, ఇప్పుడిప్పుడే కోలుకోవడానికి ప్రయత్నిస్తున్న ఏపి.. ప్రస్తుతం ఉద్యోగులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రాజధాని, ఏపి పాలనా వ్యవస్థ గురించి శాసన సబలో ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉద్యోగుల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అయితే అతను చెప్పి ప్రతి మాట వంద శాతం నిజం.
వీలైనంత త్వరగా ప్రభుత్వ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ రాజధానికి తరలి వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. రాజధాని ప్రాంతంలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేస్తామని, కొత్త రాజధాని ప్రాంతానికి రమ్మంటే అధికారులు భయపడుతున్నారన్నారని చంద్రబాబు వెల్లడించారు.  వీలైనంత త్వరలో సిబ్బంది తరలింపు జరుగుతుందని ఆయన తెలిపారు.

గతంలో ఆంధ్రరాష్ట్రానికి మద్రాసు నుంచి కర్నూలుకు అధికారులు కట్టుబట్టలతో వచ్చారని. కానీ ఇప్పుడు మాత్రం ఉద్యోగులు కొత్త రాజధానికి వచ్చేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదని చంద్రబాబు శాసన మండలిలో వివరించారు. పిల్లల చదువులు, హైదరాబాద్లో అన్ని ఉండటంతో పాటు 56 ఏళ్లుగా ఇక్కడే ఉండటంతో ఏపీ రాజధాని ప్రాంతానికి రమ్మంటేనే భయపడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటికే  గుంటూరు పరిసర ప్రాంతాల్లో సిబ్బందికి అద్దె ఇళ్లు కూడా దొరికే పరిస్థితి లేదన్నారు.  కొత్త రాజధానిపై అందరూ ఇష్టాన్ని పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ వచ్చేంతవరకూ పట్టిసీమ పని చేస్తుందని చంద్రబాబు అన్నారు. పాపం ఏపి పాలనావ్యవస్థను చక్కదిద్దడానికి, కొత్త రాజధాని ప్రాంతానికి తరలించడానికి చంద్రబాబు ఎన్ని కష్టాలను ఎదుర్కోవాలో ఏంటో.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap  govt  employees  hydebad  capital  chandrababu  

Other Articles