MAA Elections - court notices to Muralimohan and Ali

Maa elections politicised murali mohan wants control court notice

MAA, Muralimohan, Rajendra Prasad, Jayasudha, MAA Court notices

MAA Elections, politicised . Court gives notices to Murali Mohan and Ali

'మా'లో కుళ్లు,కులం,..కంపు -ఎన్నికలు.. మురళీ మోహన్, అలీకి కోర్టు నోటీసులు

Posted: 03/26/2015 11:20 PM IST
Maa elections politicised murali mohan wants control court notice

మూవీ ఆర్టిస్ట్సు అసోసియేషన్ ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ కళ్యాణ్ అనే సినీనటుడు సిటీ సివిల్ కోర్టులో ఓ పిటీషన్ దాఖలు చేశారు.అసోసియేషన్ బైలాస్కు విరుద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని ఆ పిటిషన్లో ఆరోపించారు. ఎలక్షన్ ఆఫీసర్లను మార్చాలని ఆయన కోరారు.
2,500 రూపాయలు ఉన్న నామినేషన్ ఫీజును పది వేల రూపాయలకు ఎందుకు పెంచారని ప్రశ్నించారు. ఈ పిటిషన్పై రేపు కోర్టులో వాదనలు జరుగుతాయి.

ఈ పిటీషన్‌ని విచారణకు స్వీకరించిన కోర్టు.. ప్రస్తుత మా అధ్యక్షుడు మురళీ మోహన్, నటుడు అలీకి నోటీసులు జారి చేసింది.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 'మా' ఎన్నికలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. ఒక వర్గం వారిపై మరొక వర్గం వారు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ విషయంపై మురళీమోహన్ స్పందిస్తూ... 'మా' కుటుంబంలో ఎలాంటి రాజకీయాలకు తావు లేదని, ఈ విమర్శలు చేసుకోవడం కేవలం తాత్కాలికమేనని.. ఎన్నికలు జరిగితే అంతా సర్దుకుంటాయని అన్నారు. ఈసారి కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే వుద్దేశ్యంతోనే చాలా మందిని కోరినప్పటికి ఎవరూ ముందుకు రాలేరని... ఈలోపు రాజేంద్రప్రసాద్ తాను పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారని చెప్పుకొచ్చాడు.

ఎన్నికల్లో గెలవడానికి మొబైల్‌ ఫోన్లు పంచుతున్నారు.. అని జయసుధ ప్యానల్‌కి మద్దతిస్తున్న సీనియర్‌ నటుడు కృష్ణంరాజు ఆరోపించడంపైనా నాగబాబు ఘాటుగా స్పందించారు. ''రాజకీయాల్లో మంచి అనుభవం సంపాదించిన కృష్ణంరాజు, ఆ రాజకీయాల్లో ప్రలోభాల కోసం సెల్‌ఫోన్లు పంచినట్లే, 'మా' ఎన్నికల్లో కూడా సెల్‌ఫోన్లు పంచుతారని అనుకోవడం హాస్యాస్పదం..'' అని ఎద్దేవా చేశారు నాగబాబు.

శుక్రవారంలోగా నోటీసులకు వివరణ ఇవ్వాల్సిందిగా కోర్టు ఆ ఇద్దరినీ ఆదేశించింది. దీంతో ఈ ఆదివారం జరగాల్సి వున్న మా ఎన్నికల విషయంలో సందిగ్ధత నెలకొన్నట్లయింది అంటున్నారు మా సభ్యులు. మా..అంటూ సినిమా నటుల కోసం సంఘం పెట్టి, ఇప్పుడు దానిపై ఆధిపత్యం కోసం కొట్లాడుతున్న తీరు, అంతా రాజకీయం చేసి అదీ ఇప్పుడు సినిమాల్లో నటించని వారు! మా లోపలి కుట్రలన్నీ బయటకు వచ్చి , ఛీ అనిపిస్థుఇన్ది .. అందరు వోక్కడి కంట్రోల్, గొప్ప ఏంటి అని చర్చిన్తుకున్నారు? ఇంట కుళ్ళు ఎవరి మీద? ఎందు కోసం? సినిమాల్లో ప్రతిభ మీద పైకి వస్తారు కానీ ఈ కుళ్ళు తో కాదు కద..

ఇన్ని సంవత్సరాలు ప్రెసిడెంట్ గ చేసి కూడా ఇ కుళ్ళి రాజకీయాలు చెయ్యటం ఎంత వరకు సబబు?గౌరవంగా తప్పుకొని కొత్త వాళ్ళకి అవకాసం ఇవ్వచు కదా! ఆర్టిస్టుల బాగోగులు గురించి ఈ సమయం, డబ్బు వెచ్చిస్తే ఎంత బాగుంటుంది కదా - ప్రతీ చోట ఈ రాజకీయలేన?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : MAA  Rajendra Prasad  Jayasudha  Murali Mohan  ali  

Other Articles