Ttdp | Telangana | Assembly

Ttdp leaders revanth reddy and some more leaders fire on kcr

revanthredy, ttdp, sandra, telanagana, kcr, assembly, police

ttdp leaders revanth reddy and some more leaders fire on kcr. revanth reddy said that in the telangana assembly . he said that he never saw this type of scencs.

హవ్వా.. అసెంబ్లీలో ఎన్నడూ ఇలా చూడలేదు

Posted: 03/26/2015 04:45 PM IST
Ttdp leaders revanth reddy and some more leaders fire on kcr

తెలంగాణ అసెంబ్లీలో ఎన్నడూ చూడని ఘటనలు జరుగుతున్నాయని టీటీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తమను వర్గ శత్రువులుగా చూస్తున్నారని ఆరోపించారు. తన వ్యతిరేకులు తెలంగాణలో జీవించకూడదన్నట్లు కేసీఆర్‌ తీరు ఉందని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌కు 36 శాతం ఓట్లు వస్తే మాకు 22 శాతం వచ్చాయని వివరించారు.  అవిశ్వాసం నోటీస్‌ ఇద్దామని అసెంబ్లీకి వెళితే అడ్డుకున్నారని దీంతో అసెంబ్లీ కార్యదర్శికి అవిశ్వాసం నోటీస్‌ పంపించామని రేవంత్‌ తెలిపారు. అసెంబ్లీలో జరిగే పరిణామాలపై విపక్షాలు ఆలోచించాలని మరో నేత సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మా గొంతు నొక్కినట్లుగానే త్వరలో మీ గొంతు నొక్కుతారని హెచ్చరించారు. అవిశ్వాస నోటీస్‌ను చర్చకు స్వీకరించాలని సండ్ర వెంకటవీరయ్య కోరారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే హక్కు తమకు ఉందని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. తాము ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి అన్నారు. అసెంబ్లీలో జరిగే పరిణామాలపై విపక్షాలు ఆలోచించాలని, తమ గొంతు నొక్కినట్లుగానే త్వరలో మీ గొంతు నొక్కుతారని సండ్ర వెంకటవీరయ్య అన్నారు. అవిశ్వాస నోటీసును చర్చకు స్వీకరించాలని ఆయన కోరారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : revanthredy  ttdp  sandra  telanagana  kcr  assembly  police  

Other Articles