Ysrcp | Apology | Speaker

Ysrcp mla say apology to the ap assembly speaker kodela shivaprasad

ysrcp, apology, speaker, jagan, ap, kodela

ysrcp mla say apology to the ap assembly speaker kodela. ysrcp mlas are fearing for the suspention at ap assembly. ysrcp president jagan and ysrcp mlas say apologys to speaker.

అయ్యా.. మమ్మల్ని క్షమించండి: వైసీపీ ఎమ్మెల్యేలు

Posted: 03/26/2015 04:33 PM IST
Ysrcp mla say apology to the ap assembly speaker kodela shivaprasad

దెబ్బకు దయ్యం వదిలింది. వైసీపీ నేతలను సస్పెండ్ చెయ్యాలని టిడిపి సభ్యులు చేసిన ప్రతిపాదనతో ఒక్క సారిగా వైసీపీ నేతలు దారిలోకి వచ్చారు. నిన్నటి దాకా అగ్గి మీద గుగ్గిలం లా ఎగిరిపడ్డ వారు ఇప్పుడు బాబు మమ్మల్ని క్షమించండి అంటూ శరణు వేడుకుంటున్నారు. ఓ సారి సస్పెన్షన్ కు గురైనా బుద్దిరాలేదని, మరోసారి సస్పెన్షన్ ను ప్రతిపాదిస్తు టిడిపి చేసిన ప్రతిపాదన వైసీపీలో మార్పు తీసుకువచ్చింది. అందుకే అంటారు మంత్రాలకు చింత కాయలు రాలవు.. రాళ్లకు మాత్రమే రాలుతాయి. అలాగే మాటలతో వినని వైసీపీ నేతలు ఇప్పుడు సస్పెన్షన్ భయంతో లొంగిపోయారు.

వైసీపీ ఎమ్మెల్యేలు తొమ్మది మంది ఏపి అసెంబ్లీ స్పీకర్ కోడెుల శివప్రసాద్ కు క్షమాపణ చెప్పారు. స్పీకర్  పట్ల అమర్యాదగా ప్రవర్తించి ఉంటే తమను క్షమించాలని వారు స్పీకర్ ను కోరారు. సమావేశాల్లో చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నామని వారు తెలిపారు.  వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా  వైసీపీ సభ్యులు తప్పు చేస్తే ఒప్పుకుంటామని  స్పీకర్ కు విన్నవించారు. అయితే, వైసీపీ సభ్యుల క్షమాపణను టీడీపీ మాత్రం తోసి పుచ్చుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు మనస్పూర్తిగా క్షమాపణ చెప్పడం లేదని టీడీపీ సభ్యులు ఆరోపించారు. సస్పెన్షన్ కు భయపడి క్షమాపణ నాటకాన్ని ఆడుతున్నారని టీడీపీ సభ్యులు విమర్శించారు. స్పీకర్ ను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ysrcp  apology  speaker  jagan  ap  kodela  

Other Articles